Begin typing your search above and press return to search.

జార్ఖండ్ లో బీజేపీ కి జలక్..కాంగ్రెస్ కూటమి ఆధిక్యం

By:  Tupaki Desk   |   23 Dec 2019 4:43 AM GMT
జార్ఖండ్ లో బీజేపీ కి జలక్..కాంగ్రెస్ కూటమి ఆధిక్యం
X
జార్ఘండ్ లో బీజేపీ కి షాక్ తగిలేలానే కనిపిస్తోంది. సోమవారం ఓట్ల లెక్కింపు ఫలితాల్లో ఉదయం 10 గంటల వరకూ వచ్చిన ఫలితాల ప్రకారం... కాంగ్రెస్-జేఎంఎం కూటమి ఆధిక్యం లో ఉంది. బీజేపీ వెనుక బడి ఉంది.

మొత్తం జార్ఖండ్ అసెంబ్లీ లో 81 స్థానాలుంటే 42 స్తానాలు వచ్చిన వారికి ప్రభుత్వం దక్కుతుంది. ప్రస్తుతం ఉదయం 10 గంటల వరకూ బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యం లో కొనసాగుతుండగా.. కాంగ్రెస్+జేఎంఎం 40 స్థానాల్లో ఆధిక్యం లో కొనసాగుతోంది.

ఇక హంగ్ పరిస్థితులు కనిపిస్తుండడం తో ఏజేఎస్ యూ 3 సీట్లు, జేవీఎం 4 స్థానాల్లో ఆధిక్యం లో ఉన్నాయి. దీన్ని బట్టి మ్యాజిక్ మార్క్ 42 స్థానాలు బీజేపీ, కాంగ్రెస్ కూటములకు రాకుంటే హంగ్ వస్తుంది. అప్పుడు ఏజేఎస్, జేవీఎం కీలకంగా మారుతాయి. అవి ఎవరికి మద్దతి స్తే వారిదే విజయంగా మారనుంది.

అయితే మరో రెండు సీట్లు మాత్రమే వస్తే కాంగ్రెస్, జేఎంఎం కూటమి కి అధికారం దక్కుతుంది. ఇండిపెండెంట్లు 3 ఆధిక్యం లో ఉన్నారు. వారిని కలుపుకుంటే కాంగ్రెస్, జేఎంఎం ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. మరి బీజేపీ జార్ఖండ్ లో చక్రం తిప్పుతుందా లేదా కాంగ్రెస్ కు అధికారం అప్పగిస్తుందా అన్నది వేచిచూడాలి.