Begin typing your search above and press return to search.
తెలంగాణకు ‘ఆభరణాల’ శోభ.. రానున్న 2 కంపెనీలు
By: Tupaki Desk | 13 Oct 2021 5:30 AM GMTపెట్టుబడుల్ని ఆకర్షించటం.. పెద్ద ఎత్తున కంపెనీల చూపు తెలంగాణ మీద పడుతోంది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న కంపెనీలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. దీనికి తోడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి వాతావరణం అనువుగా ఉండటంతో పాటు.. కొత్త సంస్థలకు స్వాగతం పలికేందుకు వీలుగా ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మరిన్ని కొత్త కంపెనీలు రావటానికి కారణమవుతోంది.
తాజాగా మూడు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టటానికి ముందుకు వచ్చాయి. ఇందులో ఆభరణాలకు సంబంధించి మాంచి పేరున్న మలబార్ సంస్థ ఒకటైతే.. క్యాప్స్ గోల్డ్.. హంటన్ రిఫైనర్స్ సంస్థలు సైతం తెలంగాణకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించిన ప్రభుత్వానికి తమ ప్రతిపాదనల్నిసమర్పించారు. సెప్టెంబరులో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను మలబార్ గోల్డ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో వారు ఆభరణాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు.
దీనికి ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రోత్సహం పెద్ద ఎత్తున ఉండటంతో.. నెల తిరిగేసరికి ప్రతిపాదనలు కాస్తా.. ప్రాజెక్టులోకి వెళ్లిపోతున్న పరిస్థితి. ఇందుకు తగ్గట్లే.. సదరు మూడు సంస్థలకు 20 ఎకరాల్ని కేటాయించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మూడు సంస్థలు దాదాపు వెయ్యి కోట్లకు పైనే (రూ.1033 కోట్లు) పెట్టుబడులు పెట్టున్నాయి. ఈ కంపెనీల కారణంగా ప్రత్యక్షంగా 2800 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇందుకు తగ్గట్లే.. ప్రభుత్వం ఈ మూడు సంస్థలకు రాయితీలు.. ప్రోత్సాహాకాల్ని ఇవ్వటానికి ముందుకు వచ్చింది.
ఇప్పటికే తెలంగాణలో గీతాంజలి గ్రూప్ కు చెందిన వజ్రాల శుద్ధి పరిశ్రమ ఉంది. వీరు ఆభరణాలతో పాటు వజ్రాలు పొదిగిన గడియారాల్ని తయారు చేస్తున్నారు. తాజాగా మలబార్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటంతో.. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన ముత్యాలు.. ఆభరణాల ప్రత్యేక ఆర్థిక మండలిలో మలబార్ సంస్థకు భూమిని కేటాయించనున్నారు. మరో ఆరు కంపెనీలు రాష్ట్రానికి రావటానికి సిద్ధంగా ఉన్నాయని.. అందుకు సంబంధించిన సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. మరో నెలలో స్పష్టత రావటంతో పాటు.. పరిశ్రమలు తెలంగాణకురావటానికి అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే.. ఆర్థికంగా తెలంగాణ మరింత వేగంగా దూసుకెళుతున్నట్లుగా చెప్పక తప్పదు.