Begin typing your search above and press return to search.
మత్తయ్యను అరెస్ట్ చేసేశారు
By: Tupaki Desk | 27 May 2016 4:57 AM GMTఓటుకు నోటు కేసులో తెలంగాణ అధికారులకు చుక్కలు చూపించిన జెరుసలెం మత్తయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. కాకుంటే.. ఓటుకు నోటు కేసులో కాదండోయ్. ఈ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని చూసిన అధికారులకు మత్తయ్య ఎన్ని షాకులిచ్చారో అందరికి తెలిసిన వ్యవహారమే. మత్తయ్యను టచ్ చేస్తే లేనిపోని తలనొప్పులు అన్నట్లుగా పరిస్థితులు ఏర్పడిన సమయంలో అధికారులు కాస్త వెనక్కి తగ్గారనే చెప్పాలి.
తాజాగా మత్తయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. దాదాపు పదేళ్ల క్రితం అంటే 2006లో ఒక చీటింగ్ కేసులో అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. హోటల్ మేనేజ్ మెంట్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చెప్పి కొందరు యువకుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్లుగా అభియోగం నమోదైంది. మత్తయ్య బాధితుల్లో ఒకరిగా చెబుతున్న కిరణ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో మత్తయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
మత్తయ్యను బుక్ చేసే అవకాశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అధికారులు.. ఈసారి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నాన్ బెయిల్ బుల్ వారెంట్ ఇష్యూ అయ్యాకే మత్తయ్యను అదుపులోకి తీసుకోవటం గమనార్హం. తాము అదుపులోకి తీసుకున్న మత్తయ్యను అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చటం.. న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్ కు ఆదేశించటంతో మత్తయ్యను చర్లపల్లి జైలుకు తరలించారు.