Begin typing your search above and press return to search.
మాజీ సైనికుల కొత్త కుట్ర
By: Tupaki Desk | 20 Feb 2016 9:37 AM GMTసైనికులు అంటే...దేశ ప్రజలందరిచేతా గౌరవం పొందేవారు. దేశం కోసం త్యాగం చేసేవారిలో మొదటి వరుసలో నిలిచేవారు. అయితే ఇలాంటి సైనికులను పాపపు పనికి వాడుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఏకంగా బాంబు దాడులు చేసే వారిగా ఉపయోగించుకుంటున్నారు. ఇదంతా పొరుగున ఉన్న పాకిస్తాన్ ఘనకార్యం.
పఠాన్ కోట్ వైమానిక స్థావరం పై దాడి సూత్రధారిగా భావిస్తున్న పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్ ఇ మొహమ్మద్ భారత్ పై మరిన్ని ఉగ్రదాడుల కోసం ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ కు చెందిన మాజీ సైనిక ఉద్యోగులను నియమిస్తున్నదని మన దేశ నిఘావర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లోని సైనిక స్థావరాలు, వైమానిక స్థావరాలపై దాడులకు జేఈఎమ్ కుట్రపన్నుతున్నదని నిఘావర్గాలు తాజాగా హెచ్చరించాయి. భారత దేశంలోని వైమానిక, మిలిటరీలకు చెందిన కీలక స్థావరాలపై భీకర దాడులు నిర్వహించేందుకు వ్యూహం రూపొందించిందని ఈ రిపోర్టులో స్పష్టం చేసింది. ఇదిలాఉండగా పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడికి సంబంధించి జెఇఎమ్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ పై ఎఫ్ ఐఆర్ నమోదుకు పాకిస్థాన్ దర్యాప్తు సంస్థ సిఫారసు చేసిన మరుసటి రోజే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఈ హెచ్చరిక రావడం గమనార్హం.
మాజీ సైనికోద్యోగులు అంటే ఉన్న గౌరవాన్ని వాళ్లు దేశం కోసం చేసే సేవలను సైతం తన రాక్షస కృత్యాలకు పావులుగా వాడుకోవడం పాకిస్తాన్‌కే చెల్లిందేమో. మనదేశంతో మిత్రుత్వం కోసం ప్రయత్నిస్తున్నట్లే చేస్తూ కావాలనే రెచ్చగొట్టే చర్యలకు దిగడం పాక్ బుద్ధికి అద్దంపడుతోంది.