Begin typing your search above and press return to search.
ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ గా అతడు..
By: Tupaki Desk | 15 May 2020 4:00 AM GMTకుబేరులు.. అపర కుబేరులు.. దేశంలోనే ధనవంతులు.. ఇన్నాళ్లు వీరే మనకు అత్యంత శ్రీమంతులు.. కానీ వీరిని తలదన్నే మొగుడు ఇంకా పుట్టలేదని అనుకున్నాం.. కానీ ఇప్పుడు పుట్టబోతున్నాడు. అవును.. ప్రపంచంలోనే అద్భుతం జరగబోతోంది. మామలుగా వెయ్యి బిలియన్ లేదా మిలియన్ మిలియన్లు కలిపితే ఒక ట్రిలియన్ అంటారు. ఇప్పటివరకు భూమిపై బిలియనీర్లు అత్యంత ధనవంతులుగా ఉన్నారు. బిలియనీర్ ను దాటి ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ ట్రిలియనీర్ గా అవతరలించలేదు. మొదటిసారి, త్వరలోనే ఒక ట్రిలియనీర్‌ను చూడబోతున్నాడు. అవును.. ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ గా అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ కాబోతున్నారు.
కరోనా-లాక్ డౌన్ తో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పరిశ్రమలు కుదేలయ్యాయి. ఎవ్వరికీ పని లేకుండా పోయింది. కానీ ఇ-కామర్స్ వ్యాపారాలు మాత్రం జోరుగా నడిచాయి. చాలా దేశాలలో డబ్బు సంపాదించడంలో గొప్పగా రాణించాయి. చాలా వ్యాపారాలు కుదేలైన ఈ తరుణంలో మహమ్మారి భయానికి అంతా ఆన్ లైన్ షాపింగ్ కే ప్రాధాన్యమిచ్చారు. అగ్ర ఇ-కామర్స్ వ్యాపారం అమెజాన్ లాక్డౌన్ మరియు దిగ్బంధాల సమయంలో గొప్ప వ్యాపారాన్ని చేసింది. వైరస్ వ్యాపించకుండా చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్ కోసం అమేజాన్ ను ఎంచుకున్నారు. అమెజాన్ 2020 మొదటి త్రైమాసికంలో 75.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.
ప్రస్తుత నికర విలువ 143 బిలియన్ డాలర్లు కలిగిన అమెజాన్ సీఈవో జాజ్ బెజోస్ ప్రపంచంలోని ధనవంతుల అందరికంటే అత్యంత ఎక్కువ సంపాదనతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఇటీవలి టర్నోవర్‌తో అతను 2026 నాటికి మొదటి ట్రిలియనీర్ కావచ్చు. గణాంకాల ప్రకారం, అతని నికర విలువ ప్రతి సంవత్సరం 34 శాతం సగటున పెరుగుతోంది. , మరియు 56 ఏళ్ల అతను 2026 లో తన 62 సంవత్సరాల వయస్సులో మొదటి ట్రిలియనీర్ కావచ్చు.
మొదటి ట్రిలియనీర్ జెఫ్ బెజోస్ తరువాత అతడికి సమీపంలో రాగల వ్యక్తి ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మాత్రమే. అతను 2036 నాటికి అతి పిన్న వయస్కుడైన ట్రిలియనీర్ కావచ్చని అంటున్నారు. అప్పటికి జుకెర్ బర్గ్ వయసు 51 సంవత్సరాలు.
అయితే అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ పై విమర్శలు వెల్లువెత్తాయి. మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అవుతుంటే వ్యాపారం చేసుకున్న అతడు అమెరికాకు సాయం అందించడంలో పిసినారిగా వ్యవహరించారు. జెఫ్ బెజోస్ అమెరికాకు కేవలం 100 మిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మహమ్మారి వ్యాపించకముందే మార్కెట్ కుప్పకూలిపోకముందే జెఫ్ సుమారు 3.4 బిలియన్ డాలర్ల విలువైన అమెజాన్ షేర్లను విక్రయించాడు.. బాగా సొమ్ము చేసుకున్నాడు. ఇప్పుడు అతను అమెజాన్ లో 11.2 శాతం వాటాను కలిగి ఉన్నాడు.
ప్రస్తుత ప్రపంచంలో ఆపిల్ మరియు మైక్రోసాఫ్ట్ మాత్రమే ట్రిలియన్ డాలర్ల కంపెనీలు. గూగుల్ మరియు అమెజాన్ వచ్చే ఏడాది నాటికి ట్రిలియన్ డాలర్లుగా మారే అవకాశాలున్నాయి.