Begin typing your search above and press return to search.

ప్ర‌పంచ కుబేరుడు స్థానం గేట్స్‌ ది కాదు!

By:  Tupaki Desk   |   11 Jan 2018 8:18 AM GMT
ప్ర‌పంచ కుబేరుడు స్థానం గేట్స్‌ ది కాదు!
X
సంప‌న్నుల జాబితాలో తిరుగులేని ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించే మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ ఈ ద‌ఫా వెనుక‌ప‌డ్డారు. అమెజాన్ ఫౌండ‌ర్ జెఫ్ బెజోస్ మొద‌టి స్థానంలో నిలిచారు. 2018 ప్రారంభ‌మైన త‌ర్వాత జ‌రిగిన మొద‌టి ఐదు రోజుల ట్రేడింగ్‌ లోనే జెఫ్ $6.1 బిలియ‌న్ల‌తో టాప్‌ లో నిలిచారు. ప్ర‌స్తుతం జెఫ్ ఆస్తులు $ 105 బిలియ‌న్లు! ప‌దేళ్ల కాలంలో గేట్స్ త‌న స్థానాన్ని కోల్పోవ‌డం ఇదే మొద‌టిసారి.

బ్లూమ్‌ బ‌ర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్ర‌కారం బెజోస్ నిక‌ర ఆస్తులు $105.1బిలియ‌న్ల‌కు చేరాయి. హ‌ఠాత్తుగా పెరిగిన అమెజాన్ షేర్ల ధ‌ర వ‌ల్ల $1.4 బిలియ‌న్ల మొత్తం ఆయ‌న‌కు క‌లిసివ‌చ్చి బిల్‌ గేట్స్‌ ను వెన‌క్కునెట్టింది. అక్టోబ‌ర్‌ లో బెజోస్ ఆస్తులు $93.8 బిలియ‌న్ కాగా - $100 బిలియ‌న్ల‌కు మొద‌టిసారిగా చేరింది. ఫోర్బ్స్ ప్ర‌కారం గేట్స్ ఆస్తులు 91.9 కాగా, బ్లూమ్‌ బ‌ర్గ్ ప్ర‌కారం $93.3 బిలియన్లు.

కాగా, గ‌త ఏడాది ఈ-కామ‌ర్స్ వెబ్‌ సైట్ అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు జెఫ్ బెజోస్ పంట పండింది. ఒక్క‌రోజులోనే ఆయ‌న ప్ర‌పంచ కుబేరుల్లో రెండోస్థానానికి దూసుకెళ్లారు. అమెజాన్ షేరు ఏకంగా 18.32 డాల‌ర్లు పెర‌గ‌డంతో.. బెజోస్‌ ఒక్క రోజులోనే 150 కోట్ల డాల‌ర్లు (సుమారు రూ.9700 కోట్లు) ఆర్జించారు. ఈ లాభాల‌తో ఆయ‌న అమ‌న్సియో ఓర్టెగా - వారెన్ బ‌ఫెట్‌ల‌ను వెన‌క్కి నెట్టి రెండోస్థానానికి ఎగ‌బాకారు. దుబాయ్‌ లో ఉన్న త‌మ అనుబంధ సంస్థ సౌక్‌.కామ్‌ ను అమ్మేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన మ‌రుస‌టి రోజే అమెజాన్ షేర్లు భారీగా లాభ‌ప‌డ్డాయి.