Begin typing your search above and press return to search.

అమెజాన్ వ్యవస్థాపకుడిపై పరువు నష్టం దావా

By:  Tupaki Desk   |   3 Feb 2020 6:15 AM GMT
అమెజాన్ వ్యవస్థాపకుడిపై పరువు నష్టం దావా
X
ప్రపంచ కుబేరుడుగా ఉన్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కు చిక్కుల్లో పడ్డాడు. ఆయన పరువు నష్టం దావాలో చిక్కుకున్నాడు. అతడి ప్రేయసి లారెన్ శాంచెజ్ సోదరుడు మైఖెల్ శాంచెజ్ జెఫ్ పై పరువు నష్టం దావా వేశాడు. 2019 జనవరిలో ‘ది నేషనల్ ఎంక్వైరర్’ అనే పత్రికకు ప్రేయసి సోదరుడు మైకేల్ శాంచెజ్ తన వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసినట్టు జెఫ్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను సవాల్ చేస్తూ శాంచెజ్ పరువు నష్టం దావా వేశాడు. ది నేషనల్ ఎంక్వైరర్ లీక్ చేసిన ఫొటోల్లో లారెన్ శాంచెజ్ నగ్న ఫోటోలతో పాటు జెఫ్ బెజోస్‌తో ఆమె శృంగారంలో పాల్గొన్న ఫోటోలు కూడా ఉన్నాయని తెలియడంతో జెఫ్ మైకెల్ శాంచెజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఆరోపణలతో తన పరువు దెబ్బతిందని చెబుతూ మైకేల్ పరువు నష్టం కేసు వేశాడు.

వాస్తవంగా జనవరి, 2019లో ది నేషనల్ ఎంక్వైరర్ లారెన్ శాంచెజ్, జెఫ్ బెజోస్ వ్యక్తిగత ఫొటోలను బయటపెట్టింది. దీంతో వారి వ్యక్తిగత సంభాషణకు సంబంధించిన పలు మెసేజ్‌లను కూడా బయట పెట్టింది. అయితే ఈ వివరాలు, ఫొటోలు బహిర్గతం వెనక లారెన్ శాంచెజ్ సోదరుడు మైకెల్ ఉన్నాడని బెజోస్ ఆరోపించారు. దీంతో బెజోస్ ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం కలిగిందని పేర్కొంటూ మైకెల్ తన పరువు నష్టం కేసు వేశాడు. బెజోస్ ఆరోపణలతో తాను ఇబ్బందులకు గురయ్యానని, చుట్టు పక్కలవారి ముందు అవమానానికి గురైనట్లు పిటిషన్ లో వాపోయాడు.

తన సోదరుడు చేసిన పనిని బెజోస్ లవర్ లారెన్ శాంచె‌జ్‌ ఖండించింది. తాను విధేయుడైన సోదరుడిగా, మేనేజర్‌గా వ్యవహరించానని లారెన్ కు పని చేశానని మైకెల్ తెలిపాడు. ఈ పిటిషన్‌ పై బెజోస్ లవర్ స్పందిస్తూ.. అతడివి నిరాధార ఆరోపణలు అని కుండబద్దలు కొట్టింది. అయితే ఈ పిటిషన్ విషయంలో ఇప్పటివరకు జెఫ్ బెజోస్ మాత్రం స్పందించ లేదు. వీరి ప్రేమ విషయం లో గతం లో వాల్ స్ట్రీట్ కథనం కూడా ప్రచురించింది. లారెన్ శాంచెజ్,బెజోస్ ఫోటోల లీకేజీపై గతంలో వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది.

భార్యతో విడాకులు ఈ వాల్ స్ట్రీట్ కథనంలో జెఫ్ బెజోస్ తన భార్యకు విడాకులు ఇచ్చుకున్న పరిస్థితి ఏర్పడింది. లారెన్ శాంచెజ్ సెల్‌ఫోన్ నుంచే మైకెల్‌కు ఫోటోలు, మెసేజ్‌లు వెళ్లడం, బెజోస్‌కు, ఆమెకు మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణలను తన సోదరుడు మైకెల్‌కు ఆ కథనంలో ఉంది. ఈ సమాచారాన్ని మైఖెల్ 2 లక్షల డాలర్లకు ది నేషనల్ ఎంక్వైరర్‌కు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంతో బెజోస్ భార్య మెకంజీ తీవ్ర మనస్తాపానికి గురై ఆయనకు విడాకులు కూడా ఇచ్చారు.