Begin typing your search above and press return to search.

అమేజాన్ అధిపతి ప్రపంచ కుబేరుడు ఎలా అయ్యాడు?

By:  Tupaki Desk   |   19 Dec 2019 5:30 PM GMT
అమేజాన్ అధిపతి ప్రపంచ కుబేరుడు ఎలా అయ్యాడు?
X
సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్మిన జెఫ్ బెజోస్.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలా అయ్యాడు? ఇప్పుడిదే ప్రశ్న అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. 1994లో ఒక సెకెండ్ హ్యాండ్ బుక్ షాపును అమెజాన్ పేరుతో జెఫ్ బెజోస్ నడిపేవాడు. ఇప్పుడు 2018 వచ్చేసరికి ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీ నంబర్ 1 కంపెనీగా అవతరించింది. ప్రపంచ మొట్టమొదటి ట్రిలియన్ డాలర్ కంపెనీగా నిలిచింది. ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్ నిలిచారు. దీనికంతటికి కారణం రెండు దశాబ్ధాల క్రితమే జెఫ్ బెజోస్ భవిష్యత్తును చూడగలగడమే..

సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్మే జెఫ్ బెజోస్ 1994లోనే భవిష్యత్తును చూడగలిగాడు. మాల్స్ ప్రాధాన్యత కోల్పోతాయని.. ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా ఇంటికే వస్తువులు తెచ్చే వ్యాపారానిదే భవిష్యత్ అని గ్రహించి అందులోకి ప్రవేశించి ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 కంపెనీకి అధిపతి అయ్యాడు.

*బెజోస్ బాల్యం, విద్యాభ్యాసం

బెజోస్ పుట్టగానే అతడి టీనేజ్ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తల్లి మైక్ బెజోస్ అనే ఎక్సాన్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ను వివాహం చేసుకుంది. చిన్నతనంలో జెఫ్ బెజోస్ సైన్స్, ఇంజినీరింగ్ పట్ల ఆసక్తి పెంచుకొని అంతరిక్ష కాలనీలు నిర్మించాలన్నది లక్ష్యం అని చెప్పుకునేవాడు. ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అభ్యసించాడు. తర్వాత డీఈ షా హెడ్జ్ ఫండ్ లో ఉద్యోగంలో చేరాడు. అక్కడే ఆయన భార్య మెకంజీతో పరిచమైంది.

ఆ ఉద్యోగినికి రాజీనామా చేసి సెకండ్ హ్యాండ్ పుస్తకాల వ్యాపారంలోకి దిగాడు. ఆ తర్వాత ధైర్యం చేసి బెజోస్ 7లక్షల రూపాయలతో 1995లో అమెజాన్ ప్రారంభించాడు. నెలలోపే ఆ సంస్థను 50 రాష్ట్రాలు, దాదాపు 45 దేశాలలో లావాదేవీలు ప్రారంభించాడు. అమ్మకాలు మొదటి ఐదేళ్లలోనే 10వేల కోట్లకు చేరాయి. 1997లో పబ్లిక్ కంపెనీగా మారి రూ.370 కోట్లు సేకరించింది. అలా బెజోస్ 35 ఏల్లకే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారాడు.

ఉచిత డెలివరీని తీసుకొచ్చి ఇంటికే సేవలందిస్తూ అమెజాన్ ను ప్రపంచంలోనే నంబర్ 1 కంపెనీగా బెజోస్ నిలబెట్టాడు. ఆ తర్వాత వాషింగ్టన్ పోస్టు, బ్లూ అంతరిక్ష కాలనీ సంస్థను ప్రారంభించాడు. ఎన్నో రిటైల్ , వ్యాపార సంస్థలను కొని అమెజాన్ లో విలీనం చేశారు. 2018లో అమెజాన్ 17వేల కోట్ల లాభాలను ఆర్జించింది. అమెరికాలో మొత్తం ఆన్ లైన్ అమ్మకాల్లో సగం అమెజాన్ వే..