Begin typing your search above and press return to search.

59 ఏళ్ల వయసులో కొత్త జీవితంలోకి అమెజాన్‌ అధినేత

By:  Tupaki Desk   |   23 May 2023 12:00 PM GMT
59 ఏళ్ల వయసులో కొత్త జీవితంలోకి అమెజాన్‌ అధినేత
X
అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ కొత్త జీవితానికి రెడీ అవుతున్నాడు. 59 ఏళ్ల ఈయన గత కొన్నాళ్లుగా మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్‌ అయిన లారెన్‌ శాంచెజ్‌ తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. ప్రేమ విషయాన్ని వీరిద్దరూ ఇటీవలే క్లారిటీ ఇచ్చారు. ఔను ప్రేమలో ఉన్నాం.. సహజీవనం సాగిస్తున్నాం అన్నట్లుగా క్లారిటీ ఇచ్చారు.

తాజాగా వీరిద్దరూ పెళ్లికి సిద్దం అయ్యారని.. ఇటీవలే వీరి యొక్క ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందని కూడా వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థ ఒకటి ఈ విషయాన్ని కథనంగా ప్రచురించింది. ప్రస్తుతం ఈ జంట కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్ లో సందడి చేస్తున్నారు.

ప్రాన్స్ లో ఉన్న ఈ ప్రేమ పక్షులు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారంటూ ఆ కథనంలో పేర్కొనడం జరిగింది. 53 ఏళ్ల లారెన్‌ చేతికి ఉన్న ఎంగేజ్‌మెంట్‌ రింగ్ ను మీడియా వారు గుర్తించడం.. ఆ విషయాన్ని ఆమె వద్ద ప్రస్థావించగా ఆమె అంగీకరించింది అన్నట్లుగా సదరు మీడియా సంస్థ తన కథనంలో పేర్కొనడం జరిగింది.

జెఫ్‌ బెజోస్‌ తన మొదటి భార్య మెకెంజీ స్కాట్ కి 2019 లో విడాకులు ఇవ్వడం జరిగింది. 25 ఏళ్ల వీరి యొక్క వైవాహిక జీవితం సాఫీగా సాగింది. అయితే ఇద్దరి మధ్య వచ్చిన గొడవలతో విడిపోయారు. మొదటి భార్య నుంచి అధికారికంగా విడాకులు తీసుకోక ముందునుండే అంటే 2018 నుండి డేటింగ్ లో జెఫ్ ఉన్నాడు.

అమెజాన్ సీఈవో బాధ్యతల నుండి 2021 లో వైదొలిగిన జెఫ్‌ బెజోస్ ప్రస్తుతం సంస్థ యొక్క ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పదవిలో కొనసాగుతున్నారు. అంతే కాకుండా వాషింగ్టన్‌ పోస్ట్‌ మీడియా సంస్థతో పాటు బ్లూ ఆరిజన్‌ సంస్థలో కీలక పాత్రను జెఫ్‌ బెజోస్ పోషిస్తున్నాడు.