Begin typing your search above and press return to search.

ఒక్కరోజే రూ.97 వేల కోట్లు లాభం ..ఎవరికంటే ?

By:  Tupaki Desk   |   21 July 2020 12:50 PM GMT
ఒక్కరోజే రూ.97 వేల కోట్లు లాభం ..ఎవరికంటే ?
X
అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఆస్తి సోమవారం ఒక్కరోజే 13 బిలియన్ డాలర్లు అంటే రూ.97 వేల కోట్లకు పైగా పెరిగింది. 2012లో బ్లూమ్ ‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వచ్చిన తర్వాత ఇండివిడ్యువల్ జాబితాలో రికార్డ్‌ స్థాయిలో ఆస్తులు పెరగడం ఇదే కావడం గమనార్హం. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో బయటకి వెళ్ళడానికి వీలులేకపోవడంతో చాలామంది ఆన్లైన్ షాపింగ్ కి మొగ్గుచూపడటంతో దీంతో అమెజాన్ షేర్లు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి.

ఈ నేపథ్యంలో డిసెంబర్ 2018 తర్వాత మొదటిసారి 7.9 శాతం ఎగిశాయి. ప్రపంచంలోనే కుబేరుడైన జెఫ్ ఆస్తులు 189.3 బిలియన్ డాలర్లు అయ్యాయి. జెఫ్ బెజోస్ సంపద కేవలం ఈ ఆరు నెలల్లోనే ఏకంగా 74 బిలియన్ డాలర్లు పెరిగింది. జూలై 20 (నిన్న) అమెజాన్ షేర్లు 7.9 శాతం ఎగిశాయి. ఈ ఏడాది 73 శాతం వృద్ధిని నమోదు చేసింది. జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ బెజోస్ ఆస్తులు 4.6 బిలియన్ డాలర్లు పెరిగాయి. అమెజాన్ ‌లో ఆమెకు వాటాలు ఉన్నాయి. దీంతో వరల్డ్ 13వ రిచ్చెస్ట్ పర్సన్‌ గా నిలిచారు. ఈ ఏడాది ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌ బర్గ్ సంపద 15 బిలియన్ డాలర్ల వరకు పెరిగింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆస్తులు 13.5 బిలియన్ డాలర్లు పెరిగాయి.

ఆన్లైన్ షాపింగ్ కి డిమాండ్ బాగా పెరగడంతో సోమవారం అమెజాన్ షేర్‌కు కొనుగోళ్ల మద్దతు లభించింది. అలాగే ప్రముఖ రేటింగ్ సంపద గోల్డ్‌మెన్ శాక్స్ అమెజాన్ షేరుకు గతంలో కేటాయించిన బై రేటింగ్‌ను కొనసాగిస్తూ షేరు టార్గెట్ ధరను 3,100డాలర్ల నుంచి 3,800డాలర్లకు పెంచింది. అమెజాన్ షేర్ ధర పెరగడంతో ఫలితంగా జెఫ్ బెజోస్ సంపద ఒక్కసారిగా భారీగా పెరిగింది.