Begin typing your search above and press return to search.

మళ్లీ ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్ .. సంపద విలువ ఎన్ని కోట్లంటే ?

By:  Tupaki Desk   |   17 Feb 2021 10:31 AM GMT
మళ్లీ ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్ .. సంపద విలువ ఎన్ని కోట్లంటే ?
X
అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ మళ్లీ ప్రపంచ కుబేరుడిగా అవతరించాడు. టెస్లా, స్పెస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌ను రెండో స్థానానికి పడిపోయాడు. ఆరు వారాల తరువాత అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ మళ్లీ తన అగ్రస్థానాన్ని చేరుకున్నాడు. తాజాగా ఎలాన్ మస్క్ ‌కు చెందిన టెస్లా కార్ల కంపెనీ షేర్ 2.4 శాతం పడిపోయింది. తద్వారా 4.9 బిలియన్ డాలర్ల మొత్తంలో ఎలాన్ మస్క్ కోల్పోవడంతో మరోసారి అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు.

బ్లూమ్‌ బర్గ్ బియనీర్స్ తాజా సూచీలో బెజోస్ నెంబర్ వన్ గా అవతరించాడు. జనవరిలో బెజోస్ ను అధిగమించిన 49ఏళ్ల ఎంట్రప్రెన్యూర్ ప్రపంచంలోనే అత్యంత రిచ్ పర్సన్ అయ్యారు. దీంతో ర్యాంకింగ్స్ ఆధారంగా 2017నుంచి రిచెస్ట్ పర్సన్ గా ఉన్న మస్క్.. బెజోస్‌ కు వరల్డ్ రిచెస్ట్ పర్సన్ టైటిల్‌ ను ఇచ్చేశారు. అమెజాన్ ఫౌండర్ వ్యక్తిగత సంపద, అందులో ఎక్కువగా అమెజాన్ స్టాక్ ఉండటంతో రీసెంట్ గా షేర్ ధర కూడా ఆకాశానికి చేరింది. ఇవే కాకుండా కొత్త మైలురాళ్లు చేరుకునేందుకు బెజోస్ ప్రయత్నిస్తున్నారు. గత ఆగష్టులో 200బిలియన్ డాలర్లకు మించి ఆదాయం కూడగట్టుకున్న వ్యక్తులలో తొలి స్థానంలో ఉన్నారు.

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద విలువ 191.2 బిలియన్ డాలర్లతో మరోసారి ప్రపంచ కుబేరుడిగా నిలిచాడు. అదే సమయంలో ఎలాన్ మస్క్ మొత్తం సంపద విలువ 185 బిలియన్ డాలర్లు అని బ్లూమ్ ‌బర్గ్ బిలియనీర్ సూచిక వెల్లడించింది. ప్రస్తుతం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కన్నా బెజోస్ సంపద 7.2 బిలియన్ డార్లు అధికంగా ఉందని సమాచారం.

ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా ద్వారా అధిక ఆదాయం ఆర్జిస్తున్న ఎలాన్ మస్క్ ఇటీవల క్రిప్టో కరెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఎలాన్ మస్క్ వ్యాఖ్యల నేపథ్యంలో బిట్‌ కాయిన్ ఏకంగా 50 వేల డాలర్ల మార్కును చేరుకోవడం గమనార్హం. గత నెలలో అత్యధికంగా షేర్ల విలువ కలిగి ఉన్న టెస్లా కంపెనీ ఒక్కసారిగా ఈ నెలలో 10 శాతం మేర పతనం కావడంతో ఎలాన్ మస్క్ మరోసారి కుబేరుల జాబితాలో రెండో స్థానానికి దిగజారిపోయాడు.