Begin typing your search above and press return to search.

బంధువు అరెస్టుపై జీవిత క్లారిటీ

By:  Tupaki Desk   |   22 Jun 2017 12:06 PM GMT
బంధువు అరెస్టుపై జీవిత క్లారిటీ
X
త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల ప‌ట్ల సినీ న‌టి జీవిత క‌ల‌త చెందారు. పాత నోట్ల మార్పిడి చేస్తూ జీవిత బంధువు శ్రీ‌నివాస‌రావును అరెస్ట్ చేసిన‌ట్లు మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. దీనిపై జీవిత స్పందించారు. ఈ ఉదంతంలో అరెస్టు అయిన శ్రీ‌నివాస‌రావు ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని అన్నారు. ర‌వి అనే వ్య‌క్తి త‌మ వ‌ద్ద ప‌నిచేస్తాడని వివ‌రించారు. త‌న సోద‌రుడు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌ని, అయిన‌ప్ప‌టికీ ఆయ‌న్ను ప్ర‌స్తావిస్తూ అవాస్త‌వ క‌థ‌నాలు ప్ర‌చారం చేశార‌ని జీవిత తెలిపారు.

పాత నోట్ల‌ను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించిన నేపథ్యంలో శ్రీ‌నివాస‌రావు అనే వ్య‌క్తి రూ.7కోట్ల విలువైన‌వి మార్చుతూ హైద‌రాబాద్‌ లో అరెస్టు అయ్యార‌ని, ఆయ‌న సినీ న‌టి జీవిత బంధువు అని ప్ర‌చారం జ‌రిగింది. జీవిత సోద‌రుడైన ర‌వికి శ్రీ‌నివాస‌రావు బంధువు అవుతార‌ని మీడియా క‌థ‌నాల్లో తెలిపింది. ఈ క‌థ‌నాల నేప‌థ్యంలో మీడియా ముందుకు వ‌చ్చిన జీవిత త‌న‌పై వ‌స్తున్న దుష్ప్ర‌చారంపై క్లారిటీ ఇచ్చారు.కాగా, ప్ర‌స్తుతం శ్రీ‌నివాస‌రావు పోలీసుల అదుపులో ఉన్నారు.

ఇదిలాఉండ‌గా.... కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుద‌ల చేసిన ఆదేశాల ప్ర‌కారం బ్యాంకులు - పోస్టాపీసులు - జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో పాత నోట్ల‌ను డిపాజిట్ చేసుకోవ‌చ్చు. నెల‌రోజుల పాటు ఈ అవ‌కాశం ఉంటుంది. 2016, నవంబ‌ర్‌ 8 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన నోట్ల ర‌ద్దుకు ముందు క‌లిగి ఉన్న పాత‌నోట్లు ఇప్ప‌టికీ ఎవ‌రైనా క‌లిగి ఉంటే...వాటిని డిపాజిట్ చేసుకోవ‌చ్చు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/