Begin typing your search above and press return to search.
రేవంత్ కు షాకేనా? టీపీసీసీ చీఫ్ గా సీనియర్?
By: Tupaki Desk | 5 Jan 2021 2:12 AM GMTటీపీసీసీ చీఫ్ ఎవరన్న ఉత్కంఠ ఇప్పుడు అందరిలో నెలకొంది. కాంగ్రెస్ సీనియర్లు అంతా ఎవరిని నియమిస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీపీసీసీకి నూతన అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య ఈ పీసీసీ రేసు చక్కర్లు కొడుతోంది. రేవంత్ రెడ్డి కాబోయే పీసీసీ చీఫ్ అంటూ వార్తలు వచ్చినప్పటికీ సోమవారం మరో సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు అనూహ్యంగా ప్రచారంలోకి వచ్చింది.
రేవంత్ ను ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో తనకు ఎటువంటి సమాచారం లేదని జీవన్ రెడ్డి అంటున్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ స్పందించడం లేదు. కాగా ఇప్పటికే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొందరు సీనియర్లు అంగీకరించినట్లు సమాచారం.
తెలంగాణలో కేసీఆర్ లాంటి వాగ్ధాటి, చరిష్మా, ప్రజాకర్షక, కార్యకర్తల మద్దతు రేవంత్ రెడ్డికే ఉంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా చేసి.. రేవంత్ రెడ్డిని ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించే యోచనలో అధిష్టానం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ ప్రచారాన్ని ముఖ్య నేతలు ధ్రువీకరించడం లేదు. అలా అని తోసిపుచ్చడం లేదు. జీవన్ రెడ్డి అధ్యక్షుడయ్యేందుకు అవకాశాలున్నాయని చెబుతున్నారు. సోమవారం అధినేత్రి సోనియా నిర్ణయాన్ని ప్రకటిస్తారని అంటున్నారు.