Begin typing your search above and press return to search.

ప్రభుత్వ ఉద్యోగులు అలానే రావాలట..!

By:  Tupaki Desk   |   30 Aug 2019 8:12 AM GMT
ప్రభుత్వ ఉద్యోగులు అలానే రావాలట..!
X
ఫార్మల్ షర్ట్ - నలుపు లేదా లేతరంగు కాటన్ ప్యాంట్.. పైగా ఇన్ షర్ట్ - టక్ - బెల్ట్ ఇలా ఎవరైనా వస్తే.. అబ్బో ఈయన ప్రభుత్వ ఉద్యోగా లేదా పెద్ద నౌకరీ చేస్తున్నాడో అనుకుంటాం.. అదే జీన్స్, టీషర్ట్ వేసుకొని వస్తే వీడెవడో కాలేజీ స్టూండెంటో లేక పోకిరీనో అని అభిప్రాయపడుతాం.. ఈ తేడాను అందరూ ఇట్టే గుర్తు పడుతారు.

అయితే ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులు ఫార్మల్ గానే రావాలనే నిబంధన ఏదీ లేదు. చాలా మంది ఆ హోదాకు గుర్తింపుగా ఫార్మల్ షర్ట్ - కాటన్ ప్యాంట్స్ తో వస్తూ అధికారులమనే గౌరవాన్ని పొందుతారు. అయితే ఇలా ఫార్మల్ గా రొటీన్ గా కొన్నేళ్ల కిందటి వరకు వచ్చేవారు. ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు కొట్టిన యువత మాత్రం ఫార్మల్ డ్రెస్ కు పాతరేసి అదిరేటి కొత్త జీన్స్ - టీషర్ట్ లతో ప్రభుత్వ ఆఫీసులకు వస్తున్నారట..

సమాజం ఎక్కడికో పోతుంటే ఇంకా సంప్రదాయాలు - కట్టుబాట్లు అంటూ ప్రభుత్వ ఉద్యోగులు మోడ్రన్ డ్రెస్సులకు దూరంగా ఉండాలని కొత్తగా చేరిన ఉద్యోగులు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆధునిక వేషధారణతో బీహార్ సెక్రెటేరియట్ కు ఉద్యోగులు రావడం ఎక్కువైందట.. దీంతో వారు ఉద్యోగులో కాదో తేల్చుకోవడం ప్రజలకు - అధికారులకు కష్టమవుతోందట..

దీంతో ఆధునిక దుస్తులను త్యజించి సంప్రదాయ బద్దంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు రావాలని తాజాగా బీహార్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయ సంస్కృతికి విరుద్ధమైన దుస్తులతో ఆఫీసులకు వస్తున్నారని.. ఇది విరుద్ధమైన పని అని బీహార్ సీఎస్ నిషేధించారట. ఇక నుంచి బీహార్ ఆఫీసర్లంతా సంప్రదాయ ఫార్మల్ డ్రెస్సులోనే రావాలని ఉత్తర్వులు జారీ చేశారట..

అయితే ఇది తమ హక్కులను హరించడమేనని కొత్త ఉద్యోగులు అంటుంటే.. ప్రభుత్వ ఉద్యోగి హుందా పెంచడానికే ఈ నిర్ణయమని బీహార్ ప్రభుత్వం చెబుతోంది. మొత్తంగా బీహార్ ప్రభుత్వ ఆఫీసుల్లో డ్రెస్ కోడ్ పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.