Begin typing your search above and press return to search.

మధ్యప్రదేశ్ లో జీన్స్ ,టీ షర్ట్ బ్యాన్ .. ప్రభుత్వం కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   1 Aug 2020 12:30 PM GMT
మధ్యప్రదేశ్ లో జీన్స్ ,టీ షర్ట్ బ్యాన్ .. ప్రభుత్వం కీలక నిర్ణయం !
X
ప్రభుత్వ ఉద్యోగులు అంటే ..ప్రజలకి సహాయం చేసేవారు. ప్రజల కోసం పనిచేసే వారు కాబట్టి వారికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. కానీ , ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకి , ప్రైవేట్ ఉద్యోగులకి అసలు తేడా లేకుండా పోతుంది. ముఖ్యంగా వస్త్రధారణ విషయంలో మినిమం కేర్ కూడా తీసుకోవడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా విధులకు జీన్స్ , టి షర్ట్స్ వేసుకొని హాజరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల వస్త్రదారణ విషయంలో పలు ఆంక్షలు విధిస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరయ్యే సమయంలో టీ షర్టు ధరించడం మంచి పద్దతి కాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్వాలియర్‌ డివిజన్ ‌లోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కార్యాలయాలకు జీన్స్‌, టీ షర్టులు ధరించకుండా నిషేధం విధించింది. దీనికి సంబంధించిన డివిజనల్‌ కమిషనర్‌ ఎంబీ ఓజా సర్క్యూలర్‌ జారీ చేశారు. అసలు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు ఇలా నిర్ణయం తీసుకుంది అంటే కాగా జూలై 20న ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అధ్యక్షత వహించిన సమావేశానికి మాండ్ ‌సౌర్‌ ఇల్లాలోని ఓ అధికారి టీ షర్టు ధరించి హాజరయ్యాడు. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు గౌరవమైన, సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరవ్వాలని ఆదేశించారు. తమ ఉత్తర్వులను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మధ్యప్రదేశ్‌ కంటే ముందు అనేక రాష్ట్రాలు టీ షర్టు, జీన్స్ పై నిషేధం విధించాయి. గత ఏడాది బిహార్‌, తమిళనాడు ప్రభుత్వాలు సైతం సచివాలయంలోని ఉద్యోగులు గౌరవ ప్రదమైన సాంప్రదాయ దుస్తుల్లో ధరించరాదని ఉత్తర్వులు జారీ చేశాయి.