Begin typing your search above and press return to search.

గద్దెనెక్కగానే మోడీ సెగ పెట్టాడు.

By:  Tupaki Desk   |   31 May 2019 7:30 AM GMT
గద్దెనెక్కగానే మోడీ సెగ పెట్టాడు.
X
రెండోసారి మోడీ గద్దెనెక్కగానే స్నేహితులను చీకొడుతున్నాడు. అంతా తన బలంతోనే గెలిచారని వారిని కాలదన్నుతున్నాడు. అందుకే కేంద్రమంత్రి వర్గ విస్తరణలో ఒక్క కేబినెట్ మంత్రి పదవి మాత్రమే కేటాయించడంతో జేడీయూ అధినేత నితీష్ కుమార్ అలిగారు. తమకు బీజేపీ సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని ఏకంగా కేబినెట్ నుంచి బయటకు వచ్చారు.

మిత్రపక్షమైన జేడీయూతో కలిసి బీజేపీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని బీహార్ లో పోటీచేశాయి. ఇరు పార్టీలు చెరో 17 సీట్లలో పోటీచేయగా.. జేడీయూ 16 సీట్లను గెలుచుకుంది. బీజేపీ జేడీయూ మద్దతు లేకుండానే సొంతంగా 303 సీట్లను సాధించడంతో జేడీయూ అవసరం మోడీకి లేకుండా పోయింది.

అయితే ఎన్డీఏ లో భాగస్వామిగా ఉన్నందుకు తమకు కనీసం రెండు స్థానాలు అయినా దక్కుతాయని జేడీయూ నితీష్ కుమార్ భావించాడు. అమిత్ షా తో సంప్రదింపులు జరిపినప్పటికీ ఒక్కటే పదవి ఇచ్చేందుకు అంగీకరించారు.దీంతో నితీష్ అలకబూని ఇక మంత్రివర్గంలో భాగస్వామి కాకూడదని నిర్ణయించుకున్నారు.

2013లోనూ జేడీయూ ఇలానే ఎన్టీఏ నుంచి వైదొలిగారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసిపోటీ చేశారు. పొత్తు విచ్చిన్నం కావడంతో నితీష్ కుమార్ 2017లో మరోసారి ఎన్డీఏలో చేరారు. ఇప్పుడు కూడా సీట్లు ఇవ్వలేదని మరోసారి బీజేపీపై అలకబూనారు.