Begin typing your search above and press return to search.

ఈ పరిస్థితికి కారణం కరోనా వైరసే ... జేడీయూ నేత కీలక వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   10 Nov 2020 10:50 AM GMT
ఈ పరిస్థితికి కారణం కరోనా వైరసే ... జేడీయూ నేత కీలక వ్యాఖ్యలు !
X
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ సారధ్యంలోని NDA ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాబోతోందని ఫలితాల సరళిని బట్టి చూసి చెప్పవచ్చు . బీహార్‌పై పెద్దగా ఆశలు పెట్టుకోని బీజేపీ... అక్కడ అనూహ్యంగా బలపడినట్లు ప్రస్తుత ట్రెండ్స్ ‌ని బట్టీ అర్థమవుతోంది. బీహార్ అసెంబ్లీలో 243 స్థానాలున్నాయి. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 53 స్థానాలు సాధించింది. ఈసారి ఇప్పటివరకూ 64 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇదే సమయంలో జేడీయూ 2015లో 70 స్థానాలు సాధించగా ఇప్పుడు మాత్రం కేవలం 52 స్థానాల ఆధిక్యానికే పరిమితం అయ్యింది. అంటే, ప్రజలు జేడీయూ కంటే బీజేపీనే ఎక్కువగా నమ్మారని అనుకోవచ్చు. ఎన్డీయే ప్రస్తుతం 130 చోట్ల ఆధిక్యంలో ఉండగా, మహా ఘటబంధన్ 101 చోట్ల ఆధిక్యంలో ఉంది. కింగ్ మేకర్ గా మారతారని భావించిన చిరాగ్ నేతృత్వంలోని ఎల్జేపీ 4 స్థానాలకు, ఇతరులు 8 స్థానాలకు పరిమితం అయ్యారు. బీహార్ లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించనుంది. దాదాపు 70 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే దిశగా దూసుకెళుతున్నారు. ఆ తరువాత ఆర్జేడీ అభ్యర్థులు 50 స్థానాల వరకూ, జేడీయూ 35 స్థానాల వరకూ, కాంగ్రెస్ 20 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది సమయంలోనే బీహార్ ఫలితాలపై ఓ స్పష్టత రానుంది.

ఈ ఫలితాల్లో బీజేపీ పుంజుకోగా.. సీఎం నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ మాత్రం ఘోరంగా దెబ్బతింది. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా అక్కడ కనిపిస్తోంది. ఇక, అధికార జేడీయూ తన ఓటమిని అంగీకరించినట్లే కన్పిస్తోంది. ఆర్జేడీ తర్వాత బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతుండగా జేడీయూ మూడో స్థానానికి పరిమితమైంది. తాజా ఫలితాలపై ఆ పార్టీ సీనియర్ నేత కేసీ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ‌లో ఈ పరిస్థితి కారణం కరోనామహమ్మరే కారణం అని అన్నారు. ఎన్నికలపై ఫలితాలపై స్పందించిన ఆయన.. లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఆ ఫలితాలను బట్టి చూస్తే జేడీయూ, మిత్రపక్షం కలిసి 200లకు పైగా సీట్లలో గెలవాలి. కానీ, కరోనా మహమ్మారి ప్రభావం వల్లే మేం ఓడిపోతున్నాం.. అంతేగానీ ఆర్జేడీ వల్ల కాదు అంటూ చెప్పారు . ఆర్జేడీ బ్రాండ్‌ ఏం పెరగలేదు.. నితీష్‌ కుమార్‌ పేరు ఏమీ తగ్గలేదని అన్నారు.