Begin typing your search above and press return to search.

వైసీపీ కీల‌క నేత‌తో సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ భేటీ.. రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   13 Aug 2021 3:14 AM GMT
వైసీపీ కీల‌క నేత‌తో సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ భేటీ.. రీజ‌నేంటి?
X
సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ.. జ‌గ‌న్ కేసుల‌తో ఆయ‌న పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్నేళ్ల కింద‌ట మార్మోగిన విష‌యం తెలిసిందే. అయితే.. త‌ర్వాత‌.. ఆయ‌న ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేయ‌డం.. రాజ‌కీయాల్లోకి రావ‌డం.. వ‌స్తూ వ‌స్తూనే.. ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన‌లో చేరిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న విశాఖ ప‌ట్నం ఎంపీగా జ‌న‌సేన టికెట్‌పై పోటీ చేశారు. అయితే.. వైసీపీ సునామీ నేప‌థ్యంలో ఆయన ఓడిపోయారు. ఆ త‌ర్వాత‌.. కొన్నాళ్ల‌కు ప‌వ‌న్ వ్య‌వ‌హార శైలి త‌న‌కు న‌చ్చ‌లేద‌ని పేర్కొంటూ.. ఆ పార్టీకి రాజీనామా చేశారు.

ఇక‌, అప్ప‌టి నుంచి ల‌క్ష్మీనారాయ‌ణ ఇత‌ర‌త్రా ప‌నుల్లో బిజీగా ఉంటున్నారు. ఇటీవ‌ల విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష ణ ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా.. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీక‌రించ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ.. హైకోర్టులో పిల్ వేశా రు. ఇలా.. ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ.. ప్ర‌జాసేవ‌లో ఉన్నారు. అయితే.. ఇప్పుడు తాజాగా ల‌క్ష్మీనారాయ‌ణ వైసీపీకి చేరువ‌వుతున్నారా? అనే సందేహాలు వ‌చ్చే వ్య‌వ‌హారం ఒక‌టి వెలుగు చూసింది. క‌డ‌ప‌లో ఒక కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ల‌క్ష్మీనారాయ‌ణ‌.. వైసీపీ కీల‌క నాయకుడితో భేటీ అయ్యారు. అయితే.. ఈ భేటీలో వ్య‌క్తిగత విష‌యాలే చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌ని అంటున్నా.. రాజ‌కీయ నేత‌లు మాత్రం `ఇంకేమైనా.. చ‌ర్చించారా?`` అనే కోణంలోనూ ఆలోచ‌న చేస్తున్నారు.

క‌డ‌ప జిల్లాలో వైసీపీ ప్ర‌ముఖ నేత‌, ప్ర‌సిద్ధ ర‌చ‌యిత డాక్ట‌ర్ ఎమ్వీ ర‌మ‌ణారెడ్డి(ఎమ్వీఆర్) ఇంటికి ల‌క్ష్మీనారాయ‌ణ వెళ్ల‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. కొన్ని వ్య‌క్తిగ‌త కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరుకు వ‌చ్చిన ల‌క్ష్మీనారాయ‌ణ ఇటీవ‌ల ఆప్కాబ్ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌విని ద‌క్కించుకున్న డాక్ట‌ర్ ఎమ్వీఆర్ కోడ‌లు మ‌ల్లెల ఝాన్సీరాణితో క‌లిసి ఓ ట్రాక్ట‌ర్ షోరూంను ప్రారంభించారు. అనంత‌రం ఎమ్వీఆర్‌ను ఎమ్వీఆర్ ఇంటికి వెళ్లి.. ఆయ‌న‌తో భేటీ అయ్యారు.

ఇదే ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది. ఒక‌వైపు వృద్ధాప్య స‌మ‌స్య‌లు బాధిస్తున్నా, మ‌రోవైపు మంచంపై నుంచే ర‌చ‌నా వ్యాసంగాన్ని కొన‌సాగిస్తున్న ఎమ్వీఆర్‌ను క‌లిసిన ల‌క్ష్మీనారాయ‌ణ ఆయ‌న ర‌చ‌న‌ల‌పై చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. ఈ సంద‌ర్భంగా ఎమ్వీఆర్ దంప‌తుల‌కు ల‌క్ష్మీనారాయ‌ణ పాదాభివంద‌నం చేశారు. ప్ర‌పంచ ప్ర‌సిద్ధ ర‌చ‌న గోర్కీ న‌వ‌ల "మ‌ద‌ర్" తెలుగు అనువాదం పూర్త‌యిన‌ట్టు ఎమ్వీఆర్ తెలిపారు. రాయ‌ల‌సీమ సాగు, తాగునీటి స‌మ‌స్య‌లు, అలాగే ఉత్త‌మ ర‌చ‌న‌ల‌పై వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఆస‌క్తిక‌ర చర్చ జ‌రిగింద‌ని అంటున్నారు. అయితే.. పొలిటిక‌ల్‌గా మాత్రం ల‌క్ష్మీనారాయ‌ణ వైసీపీకి చేరువ అయ్యే క్ర‌మంలోనే ఒక అడుగు వేశార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.