Begin typing your search above and press return to search.
ఓపెన్ అయిన మాజీ జేడీ.. ఈసారీ విశాఖ బరి నుంచే పోటీ చేస్తాడట
By: Tupaki Desk | 17 April 2023 10:03 AM GMTప్రజల తరఫున విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన బిడ్ ను వేసి వార్తల్లోకి వచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తాను ఇప్పటికి రాజకీయాల్లో ఉన్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను విశాఖ నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలు కావటం తెలిసిందే. జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగినప్పటికీ.. రాజకీయ ప్రత్యర్థుల మాదిరి డబ్బులు పంచకపోవటం కారణంగా ఆయన ఓటమిని చూడాల్సి వచ్చింది.
వచ్చే ఎన్నికల లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారని.. విశాఖ నుంచి పోటీ చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ.. దానిపై స్పష్టత లేదు.తాజాగా ఆ కొరతను తీరుస్తూ లక్ష్మీనారాయణే స్వయంగా ఎన్నికల్లో పోటీ గురించి చెప్పేశారు. ఈ సందర్భంగా తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానన్న దాని మీదా క్లారిటీ ఇచ్చారు. ఈసారి తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్ చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఒక ప్రైవేటు స్కూల్ లో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అవసరమైతే తాను వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని పేర్కొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా తాను అడ్డుకుంటానని.. అందుకు తగిన ప్రయత్నాలు తాను చేస్తానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొన్న ఆయన.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా విశాఖ స్టీల్ ను కాపాడుకోవచ్చని పేర్కొనటం తెలిసిందే.
తాజాగా మరోసారి తాను పిలుపునిచ్చిన కార్యక్రమం గురించి వివరిస్తూ.. 1980లో వావిలాల గోపాలక్రిష్ణ చేపట్టిన పైసా ఉద్యమం స్ఫూర్తితో ప్రతి తెలుగు కుటుంబం నెలకు రూ.100 ఇస్తే రూ.850 కోట్లు సమకూరుతాయని.. ఇలా నాలుగు నెలల పాటు నిధులు సేకరిస్తే స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవచ్చన్నారు.
అంతా బాగానే ఉంది కానీ.. కొన్నేళ్ల క్రితం ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు అమరావతి నిర్మాణం కోసం తెలుగు వారు ఒక్కో ఇటుకను విరాళంగా ఇవ్వాలంటూ.. ఒక వెబ్ సైట్ ను ఏర్పాటు చేయటం తెలిసిందే. దాన్నే పట్టించుకోని తెలుగోళ్లకు.. మాజీ జేడీ మాటల్ని సీరియస్ గా తీసుకుంటారా? అన్నది అసలు ప్రశ్న. ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారుగా? చూద్దాం ఏం జరుగుతుందో?