Begin typing your search above and press return to search.
విశాఖ స్టీల్ ప్లాంట్ పై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 21 April 2023 2:00 PM GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం.. ప్లాంట్ కు ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేయడం లేదా వర్కింగ్ కేపిటల్ ఫండింగ్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ బిడ్లు దాఖలుకు ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం 29 కంపెనీలు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు దాఖలు చేశాయి. బిడ్ల దాఖలుకు గడువు కూడా ముగిసింది.
అయితే ప్లాంటును కాపాడుకోవడానికి ఏపీ ప్రభుత్వం ముందుకు రాలేదు. అలాగే తాము సింగరేణి సంస్థ తరఫున బిడ్ దాఖలు చేస్తామని ఇటీవల భారీగా ప్రకటనలు గుప్పించిన తెలంగాణ ప్రభుత్వం కూడా లైట్ తీసుకుంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనలపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో విశాఖ స్టీల్ ప్లాంటులో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్డు దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కు లేఖ రాశారు. దీన్ని ట్విట్టర్ లో పోస్టు చేశారు. మార్చి 27వ తేదీన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అధికారులు జారీ చేసిన నోటీసులకు అనుగుణంగా తాను బిడ్స్ వేశానని, దీన్ని అంగీకరించాలని ఆ లేఖలో లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.
ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేయడం లేదా వర్కింగ్ కేపిటల్ ఫండింగ్ కోసం జారీ చేసిన నోటీసుల్లో భాగంగా తాను ఆసక్తి వ్యక్తీకరణను తెలుపుతూ బిడ్ వేశానని లక్ష్మీనారాయణ వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పని చేయడానికి సంవత్సరానికి 7.3 మెట్రిక్ టన్నుల ముడి ఇనుము అవసరమవుతుందని తెలిపారు.
నాలుగు నెలల కోసం దీని విలువ రూ.850 కోట్లు ఉంటుందన్నారు. ఈ మొత్తాన్ని తాను ప్రజల నుంచి సేకరిస్తున్నానని లక్ష్మీనారాయణ తెలిపారు. స్టీల్ ప్లాంటును కాపాడుకోవడానికి సేకరించిన ఈ మొత్తాన్ని నేరుగా విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం బ్యాంకు అకౌంట్లల్లో జమ చేస్తామని లక్ష్మీనారాయణ లేఖలో వివరించారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిధులను సమీకరించారని లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. అదే విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి ప్రజల నుంచి తాను నిధులను సేకరిస్తున్నానని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ప్రజల విరాళాలను స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అంగీకరిస్తుందా? లేదా? అనేది వెల్లడించాలని లేఖలో కోరారు. ఈ విషయంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం లక్షలాది మంది ప్రజల మనోభావాలను గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను రాసిన లేఖకు సమాధానం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.