Begin typing your search above and press return to search.
రాజధానులపై జేడీ హాట్ కామెంట్స్ వైరల్!
By: Tupaki Desk | 27 Feb 2023 10:59 AM GMTసీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రూ.2 వేల నోటు దొరకడం లేదని.. అదంతా నల్లధనంగా మారుతోందని హాట్ కామెంట్స్ చేశారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు లక్ష్యం నెరవేరడం లేదని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది నాయకులు రూ.2 వేల నోటును నల్లధనంగా దాచేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో రూ.2 వేల నోటును కూడా కేంద్రం రద్దు చేయడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు.
రాజధానిపైన కూడా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా అమరావతిని ఉంచి అన్ని జిల్లాలను అభివృద్ధి చేయడం సరైన పని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో శాసనసభ సాక్షిగా అమరావతిని రాజధానిగా నిర్ణయించారని లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. దీనికి నాటి ప్రతిపక్షం వైసీపీ కూడా మద్దతు తెలిపిందన్నారు. ఈ నేపథ్యంలో రాజధానిని మార్చడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం కొన్ని భవనాలు, కార్యాలయాలు ఏర్పాటు చేసినంత మాత్రాన ఆ ప్రాంతం అభివృద్ధి చెందదన్నారు.
బ్యాంకింగ్ రంగంలో ఎక్కడ ఏ కుంభకోణం జరిగినా దానిని ప్రతి బ్యాంకు ఉద్యోగి దాన్ని కేస్‌స్టడీగా తీసుకోవాలన్నారు. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే సత్తా బ్యాంకులకే ఉందని తెలిపారు. దేశంలో రుణాలు ఇవ్వడానికి ఎన్నో బ్యాంకులు ఉన్నాయన్నారు. అయితే ప్రజలు అధిక వడ్డీలకు లోన్ యాప్ లను ఎందుకు ఆశ్రయిస్తున్నారో బ్యాంకులు దృష్టిపెట్టాలని సూచించారు. బ్యాంకులు ఎక్కువగా రుణాలు ఇవ్వాలన్నారు.
కాగా 2019 ఎన్నికల ముందు మహారాష్ట్ర కేడర్‌లో ఐపీఎస్ అధికారిగా ఉన్న వీవీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంధ పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరారు. విశాఖపట్నం ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మూడో స్థానంలో నిలిచారు. 2,88,874 ఓట్లు సాదించారు. మొత్తం ఆయనకు 23 శాతం పైగా ఓట్లు పోలయ్యాయి. ఎన్నికలయ్యాక పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకోవడాన్ని అంగీకరించలేక జనసేనకు లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు.
ఆ తర్వాత టీడీపీలో, వైఎస్సార్‌సీపీలో, బీజేపీలో ఇలా పలు పార్టీలు ఆయనకు ఆహ్వానం పలికాయని.. ఆ పార్టీల్లో చేరనున్నారని పలు వార్తలు వచ్చాయి. అయితే ఇవేమీ నిజం కాలేదు.
ప్రస్తుతం లక్ష్మీనారాయణ తూర్పుగోదావరి జిల్లాలో కొంత భూమిని కౌలుకు తీసుకుని ప్రకృతి సాగు చేస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల ఆహ్వానం మేరకు వాటిని సందర్శిస్తున్నారు. విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ విశాఖపట్నం నుంచే ఎంపీగా పోటీ చేస్తానని లక్ష్మీనారాయణ తేల్చిచెప్పారు. విశాఖ రైల్వే జోన్, ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు, రాష్ట్ర విభజన అంశాల అమలు వంటి వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన పార్టీలో చేరతానన్నారు. లేదంటే ఇండిపెండెంట్ గా అయినా విశాఖ నుంచి పోటీ చేస్తానని తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.