Begin typing your search above and press return to search.

విశాఖ బీచ్ లో వెంకయ్యతో జేడీ వాకింగ్ టాకింగ్

By:  Tupaki Desk   |   21 April 2023 6:25 PM GMT
విశాఖ బీచ్ లో వెంకయ్యతో జేడీ వాకింగ్ టాకింగ్
X
ఇద్దరూ ప్రముఖులే. ఇద్దరూ విశాఖ పౌరులే. దేశానికి ఉప రాష్ట్రపతిగా అయిదేళ్ల పాటు విశేష సేవలు అందించిన ముప్పవరపు వెంకయ్యనాయుడు అధికార పదవీ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. ఆయన ప్రస్తుతం ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

ఆయనకు విశాఖ అంటే ఇష్టం. అక్కడే న్యాయ విద్యను అభ్యసించారు. అక్కడే రాజకీయంగానూ అన్నీ చూశారు. ఆయన ఏ ఉన్నత పదవిలో ఉన్నా విశాఖను విడిచిపెట్టరు. ఏడాదిలో కనీసం అర డజన్ సార్లు అయినా విశాఖ వస్తూనే ఉంటారు. కొన్ని రోజుల పాటు గడుపుతారు.

వెంకయ్యనాయుడుకు విశాఖ బీచ్ లో వాకింగ్ చేయడం ఇష్టం. ఆయన అలా ఈ రోజు వాకింగ్ చేస్తూంటే విశాఖలో స్థిరపడిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కనిపించారు. ఆయన 2019లో విశాఖ నుంచి ఎంపీగా జనసేన తరఫున పోటీ చేసి ఓడారు. 2024లో మళ్లీ పోటీ చేయాలని చూస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం విషయంలో జేడీ ముందుండి పోరాడుతున్నారు. ఈ మధ్యనే ఆయన స్టీల్ ప్లాంట్ బిడ్లను ఇన్వైట్ చేస్తే తన తరఫున దాఖలు చేసి వచ్చారు. న్యాయపరమైన పోరాటంతో పాటు అనేక మార్గాల ద్వారా ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు

విశాఖ బీచ్ లో వాకింగ్ వేళ కలసిన ఈ ఇద్దరు నేతలూ ఒక చోట కూర్చుని ముచ్చటించుకున్నారు. వారిద్దరూ ఏమి మాట్లాడుకున్నారు అన్నది బయటకు తెలియకపోయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రీవేటీకరణ గురించి కూడా మాట్లాడుకుని ఉంటారని భావిస్తున్నారు.

సీనియర్ మోస్ట్ లీడర్ అయిన వెంకయ్యనాయుడు నుంచి ఈ విషయంలో జేడీ విలువైన సూచనలు సలహాలు పొంది ఉంటారని అంటున్నారు. మొత్తానికి విశాఖ తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఇద్దరు నేతలు కలసి దేశానికి మంచి చేసే విషయాలు ముచ్చటించి ఉంటారని అంతా భావిస్తున్నారు.