Begin typing your search above and press return to search.

జేడీ రాజ‌కీయాల్లో ఉన్నారా..? లేదా?

By:  Tupaki Desk   |   31 Dec 2021 9:30 AM GMT
జేడీ రాజ‌కీయాల్లో ఉన్నారా..?  లేదా?
X
ఎవ‌రికైనా.. రాజ‌కీయాల్లో ఎద‌గాలంటే.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయ‌క‌త‌ప్ప‌దు. అదేస‌మ‌యంలో పోరాటం చేస్తున్నాం క‌దా.. అంటూ.. ఎక్క‌డో కూర్చుని.. కోర్టుల్లో న్యాయ పోరాటం చేయ‌డంద్వారా కూడా ఇమేజ్ పెర‌గ‌దు. ఈ మాట‌లు ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. సీబీఐ మాజీ జేడీ.. జ‌న‌సేన మాజీ నాయ‌కులు.. ల‌క్ష్మీనారాయ‌ణ అనుస‌రిస్తున్న విధానాల‌ను ప‌రిశీలిస్తే.. రాజ‌కీయ నేత‌లు.. ఇదే మాట అంటున్నారు కాబ‌ట్టి. న్యాయ పోరాటాలు చేయొచ్చు. ఎక్క‌డో కూర్చుని మాత్రం కాదని అంటున్నారు.

గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. ఆయన ఐపీఎస్ అధికారి. కానీ, ఎన్నిక‌ల స‌మ‌యానికి ఆయ‌న జ‌న‌సేన‌లో చేరి.. విశాఖ పార్ల‌మెంటు స్థానం నుంచి జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయ‌న‌కు అప్పుడు ఎన్నో మంచి ఆప్ష‌న్లు ఉన్నా ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా జ‌నసేన‌లో పోటీ చేశారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ప‌వ‌న్ తీరును త‌ప్పుప‌ట్టి ఆ పార్టీకి దూరం జ‌రిగారు.

ఇక‌, ఆ త‌ర్వాత కొంత కాలం.. అక్క‌డ ప‌ర్య‌టించి.. ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటాన‌ని చెప్పారు. కానీ, త‌ర్వాత‌.. మాత్రం ఆయ‌న అక్కడ కనిపించ‌డం మానేశారు. హైద‌రాబాద్‌కు, విజ‌య‌వాడ‌కు ప‌రిమిత‌మ‌య్యార‌నే టాక్ జోరుగా వినిపిస్తోం ది. అయితే.. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌రణ విష‌యంలో మాత్రం ఆయ‌న న్యాయం పోరాటం చేస్తున్నారు. ఇది మంచిదే.. ఎవ‌రూ కాద‌నరు. కానీ.. ప్ర‌జ‌ల్లో వ‌చ్చే ఎన్నిక్ల‌లో విజ‌యం ద‌క్కించుకోవాలంటే.. మాత్రం ఇలా న్యాయ పోరాటాలు చేయ‌డం ఒక్క‌టే సాధ్యం కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. నిత్యం త‌మ మ‌ధ్య ఉండే నాయ‌కులకే.. ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్ట‌డం క‌ష్టంగా మారిపోయిన ప‌రిస్థితి నెల‌కొంది.

పైగా.. నీతి నిజాయితీ ప‌రుడిగా త‌న‌ను తాను ప్రొజెక్టు చేసుకున్నారు. ఇది వ్య‌క్తిగ‌తంగా చాలా మంచి ప‌రిణామం. అయితే.. నేటి కాలానికి మాత్రం ఇవి ఎక్క‌డా స‌రిపోవు. ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచాలి. కానీ, ఇది సాధ్యం కాదు. మ‌రి అలాంటి స‌మ‌యంలో నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండి.. వారి మ‌నిషిగా గుర్తింపు పొందాలంటే.. మాస్ యాక్టివిటీ పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచిస్తున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.