Begin typing your search above and press return to search.

తాడిపత్రి పీఎస్ లో లొంగిపోయేందుకు వెళ్లిన జేసీ.. అంతలోనే ట్విస్ట్

By:  Tupaki Desk   |   28 Dec 2020 10:15 AM GMT
తాడిపత్రి పీఎస్ లో లొంగిపోయేందుకు వెళ్లిన జేసీ.. అంతలోనే ట్విస్ట్
X
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి మధ్య జరిగిన ఫైట్ జిల్లాలో హైటెన్షన్ పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డిపై పట్టణ పీఎస్ లో కేసులు నమోదయ్యాయి.

తనపై నమోదైన కేసుల్లో చిక్కులు రాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయేందుకు బయలు దేరారు. ఈ విషయం తెలియడంతో జేసీ అనుచరులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. తీవ్రంగా ఒత్తిడి చేయడంతో తిరిగి జేసీ ఇంటికి చేరుకున్నారు. జేసీ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

ఆదివారం తాడిపత్రిలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని కూడా వదలలేదు. పెద్దారెడ్డిపై అట్రాసిటీ కేసులు పెట్టారు. ఆయన కుమారులపైనా హత్యాయత్నం కేసులు పెట్టారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి సహా మొత్తం 15 మందిపై పోలీసులు మూడు కేసులు పెట్టారు.

అలాగే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సహా 27మందిపై పోలీసులు ఇప్పటికే మూడు కేసులు పెట్టారు.