Begin typing your search above and press return to search.

ఎన్నికల్లో వలంటీర్లపై కోర్టుకు జేసీ

By:  Tupaki Desk   |   19 Feb 2021 1:30 PM GMT
ఎన్నికల్లో వలంటీర్లపై కోర్టుకు జేసీ
X
ఎన్నికల్లో వలంటీర్ల సేవలను ఉపయోగించుకోవద్దని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై హైకోర్టును కూడా ఆశ్రయిస్తానని చెప్పారు.వలంటీర్లలో 90శాతం తమ పార్టీకి చెందిన వారేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారని.. అందువల్ల వారిని ఎన్నికల్లో ఉపయోగించుకోవద్దని తాను కలెక్టర్ ను కోరుతానని చెప్పారు. ఈ విషయమై ఎస్ఈసీని కలిసి వినతిపత్రం ఇస్తానని చెప్పారు. కోర్టును కూడా ఆశ్రయిస్తానని తెలిపారు.

వలంటీర్లే రాష్ట్రంలో రాజకీయ నేతలుగా ఉన్నారని.. గెలుపు, ఓటములను సైతం వారు నియంత్రిస్తున్నారని జేసీ ఆరోపించారు. తాడిపత్రిలో వలంటీర్ల సేవలను ఎన్నికల్లో ఉపయోగిస్తే శాంతిభద్రతల సమస్యలు వస్తాయని ఆయన హెచ్చరించారు.

తాడిపత్రి నియోజకవర్గంలో కలెక్టర్, ఎస్పీ బాగా పనిచేసి ఎన్నికలు నిర్వహించారని.. రాత్రి 7 గంటల తర్వాత వచ్చిన ఫలితాలు సరైనవి కావని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోని వారిని మేనేజ్ చేసి ఫలితాలు ప్రకటించారని అన్నారు.