Begin typing your search above and press return to search.
అచ్చెన్న - జేసీలకు జైల్లో కరోనా? అసలేంటి కథ?
By: Tupaki Desk | 19 Aug 2020 2:00 PM GMTపచ్చకామెర్ల వ్యక్తికి లోకమంతా ‘పచ్చ’గానే కనిపిస్తుందన్నట్టు ఇప్పుడు ఏపీలో ఏ ఉపద్రవం వచ్చినా సీఎం జగనే చేస్తున్నాడన్న కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్.. టీడీపీ అధినేత చంద్రబాబు కనీసం కామన్ సెన్స్ లేకుండా చేస్తున్న విమర్శలు నవ్వుల పాలవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా జగన్ సర్కార్ పై ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. మొన్న అచ్చెన్నాయుడు, నేడు జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా అంటించారని మండిపడ్డారు. ఇద్దరు నేతలకు వైరస్.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సోకిందని విమర్శించారు. ఇందులో ప్రభుత్వ దురుద్దేశం దాగి ఉందన్నారు.
ఇక నారా లోకేష్ బాబు కూడా ఇదే విషయంపై స్పందించారు. ‘జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బెయిల్ పై రిలీజ్ అయ్యిన 24 గంటల్లోనే మరో కేసు అంటూ మళ్ళీ అరెస్ట్ చేసారు. ఆయన కడప జైలులో కరోనా బారిన పడటం బాధాకరమన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ.. అచ్చెన్నాయుడు ఏదో స్వాతంత్ర్యం సంగ్రామంలో ఫైట్ చేసిన జైలుకెళ్లిన వారు కారు.. వాళ్లు స్కాంలు, తప్పు చేశారనే ఆరోపణలు రావడంతో విచారణను ఎదుర్కొంటూ జైలుకు వెళ్లారు. కానీ దీనికి వైఎస్ జగన్ ప్రభుత్వానికి ముడిపెట్టడం దారుణమని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. తప్పులు చేసి జైలుకెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమీ చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రోజుకు 10వేల కేసుల వరకు నమోదవుతున్నాయి. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డితోపాటు ఏపీ వ్యాప్తంగా అన్ని జైళ్లలో ఉన్న 1000మంది ఖైదీలకు కరోనా వచ్చింది. ఆ క్రమంలోనే అచ్చెన్న, జేసీలకు సోకింది. అయినా దాన్ని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు, లోకేష్ లు ముడిపెట్టడం.. ‘మోకాలికి.. బోడిగుండుకు ముడిపెట్టడమేనని’ పలువురు ఎద్దేవా చేస్తున్నారు.
ఇది కరోనా విపత్తు సమయం.. అలా అని వ్యవస్థలు పనిచేయకుండా టీడీపీ నేతలను చూస్తూ ఊరుకోవాలా.? తప్పు చేస్తే అరెస్ట్ చేయకుండా ఉండాలా? తప్పు చేశారా? ఒప్పు చేశారా అన్నది కోర్టులో తేలుతుంది. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొన్నవారు.. కేసుల్లో ఇరుకున్న వారంతా జైల్లోనే ఉన్నారు. కోర్టులో నిర్ధోషిగా తేలితే బయటపడుతారు. కానీ టీడీపీ పెద్దలు మాత్రం అచ్చెన్నా, జేసీలకు జగన్ సర్కారే కరోనా అంటించిందని రచ్చ చేయడం అభాసుపాలవుతోంది. చంద్రబాబు, లోకేష్ లు మరీ శవాల మీద పేలాలు ఏరే రాజకీయం చేస్తున్నారని పలువురు సెటైర్లు వేస్తున్నారు.