Begin typing your search above and press return to search.

బెయిల్ పై బయటకు రాగానే పోలీసులపై జేసీ ప్రతాపం?

By:  Tupaki Desk   |   7 Aug 2020 11:50 AM GMT
బెయిల్ పై బయటకు రాగానే పోలీసులపై జేసీ ప్రతాపం?
X
జేసీ ట్రావెల్స్ బస్సుల స్కాం కేసులో జైల్లో ఉన్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలు నిన్న బెయిల్ పై విడుదలయ్యారు. బయటకు రాగానే పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి తన ప్రతాపం చూపించారని తాజా వీడియోను బట్టి తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించారు. నీ అంతు చూస్తానంటూ ఆయన సీఐని బెదిరించడం వీడియోలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో దృశ్యాలు టీవీ చానెళ్లలోనూ ప్రసారమయ్యాయి.

బెయిల్ పై విడుదలై తాడిపత్రికి వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డికి స్వాగతం చెప్పడానికి పెద్ద ఎత్తున అనుచరులు వచ్చి ర్యాలీ తీశారు. ఈ క్రమంలోనే అంబులెన్స్ లకు దారి కూడా ఇవ్వకుండా జేసీ ర్యాలీ కాన్వాయ్ సాగింది. వారిని నియంత్రించడానికి ప్రయత్నించిన పోలీసులు, సీఐపై జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. కారు దిగి పోలీసులపైకి ఉరిమి చూస్తూ చేతులు చూపిస్తూ బెదిరింపులకు దిగాడు. తన అనుచరులతో కలిసి పోలీసులపైకి దూసుకెళ్లారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కాగా పోలీస్ విధులకు ఆటంకం కలిగించినందుకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై సెక్షన్ 353తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకింద కేసు నమోదు చేసినట్టు అనంతపురం పోలీసులు తెలిపారు.