Begin typing your search above and press return to search.
తమ ప్రాంతంలోనూ రైతులు పాదయాత్ర చేయాలి: రాయలసీమ నేత హాట్ కామెంట్స్
By: Tupaki Desk | 18 Sep 2022 12:30 PM GMTఅమరావతి రాజధానికి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన మద్దతు ప్రకటించారు. రాజధాని రైతులు తమ ప్రాంతంలోనూ పాదయాత్ర చేయాలని కోరారు. మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును, సీఆర్డీఏ రద్దు చట్టాలను రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం తెచ్చిన బిల్లులను ఏపీ హైకోర్టు కొట్టేసిన ఆరు నెలల తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేయడమేమిటని మండిపడ్డారు. రైతులు అధైర్య పడాల్సిన పనిలేదని అన్నారు. సుప్రీంకోర్టులో సైతం రైతులకు అనుకూలంగానే తీర్పు వస్తుందన్నారు. అమరావతే రాజధానిగా ఉంటుందన్నారు.
అలాగే రైతులు పాదయాత్ర చేస్తుంటే దాన్ని ఉత్తరాంధ్రలో వద్దని చెప్పడం ఏమిటని జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. అమరావతి రాజధాని అయితే అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉంటుందని తెలిపారు. రైతులను మానసికంగా భయపెట్టాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని జేసీ ప్రభాకర్ ఆరోపించారు.
అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర బాపట్ల జిల్లా రేపల్లో నియోజకవర్గంలోని నగరంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారికి జేసీ ప్రభాకర్ రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. అధైర్య పడొద్దని రైతులకు భరోసా ఇచ్చారు. హైకోర్టు తీర్పు వెల్లడించిన ఆరు నెలల తర్వాత జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం ఏంటీ? అని ఆయన ప్రశ్నించారు.
మూడు రాజధానుల అంశం కేవలం జగన్ మైండ్ గేమ్ మాత్రమే అని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ''నేను ఇప్పుడు రాయలసీమ నుంచి ఇక్కడకు వచ్చా.. నన్ను ఎవరూ ఆపలేదు. మా ప్రాంతంలో కూడా పాదయాత్ర పెట్టాలని రైతులను కోరుతున్నా'' అని తెలిపారు. అమరావతి... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉంటుందని చెప్పారు. తాము రాయలసీమ నుంచి విశాఖ వెళ్లాలంటే 12 వందల కిలోమీటర్లు వెళ్లాలన్నారు. రైతులను మానసికంగా బయపెట్టడం కోసమే సీఎం జగన్ యత్నిస్తున్నారని ఆరోపించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నంత ఊపు ఇప్పుడు లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
రైతుల పాదయాత్ర సెప్టెంబర్ 18న ఆదివారం రేపల్లె చేరుకోనుంది. అక్కడి నుంచి కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది.