Begin typing your search above and press return to search.
జేసీ అరెస్ట్ వెనుక ఉన్న అసలు కోణం ఇదే !
By: Tupaki Desk | 13 Jun 2020 6:00 AM GMTతాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదు శివారు శంషాబాద్ లో వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతపురానికి తరలిస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారన్న రవాణాశాఖ అధికారుల ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఆరా తీయగా నకిలీ పత్రాలు సృష్టించి 154 వాహనాలను నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తోంది. 154 బస్సులు నకిలీ NOC, ఫేక్ ఇన్స్యూరెన్స్ కేసులో వీరిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు 154 వాహనాలను నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా వారు గుర్తించారు. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్ పై మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్ పై ఇప్పటివరకు 27 కేసులు ఉన్నాయి. ఈ వాహనాలు ఏపీ, నాగాలాండ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయని.. ఒకే నకిలీ ఇన్స్యూరెన్స్ పాలసీని నాలుగైదు వాహనాలకు చూపినట్లు రవాణాశాఖ గుర్తించింది. జఠాధర, గోపాల్ రెడ్డి కంపెనీల పేర్లతో అశోక్ లేలాండ్ స్క్రాప్ అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి.
తాజాగా లారీల్ని కొనుగోలు చేసి వాటిని బస్సులుగా మార్చి తిప్పుతున్న వైనం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అశోక్ లేలాండ్ తయారు చేసిన బీఎస్-3 లారీల్ని తుక్కు కింద పెద్ద ఎత్తున కొనుగోలు చేయటం అక్రమ రిజిస్ట్రేషన్ల కు పాల్పడినట్లు ఈ మద్యే గుర్తించారు. 98 లారీల్ని నాగాలాండ్ లో.. 32 లారీల్ని ఏపీలో మరో 24 లారీల్ని తమిళనాడు ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ లారీల్లో 101 లారీలు ఏపీలో 33 కర్ణాటకలో 15 తెలంగాణలో తమిళనాడు ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు, అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసిన లారీల్ని వేర్వేరు వారికి అమ్మేసిన వైనాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రవాణశాఖ కమిషనర్ పీఎస్ ఆర్ ఆంజనేయులు స్పందిస్తూ.. 154 వాహనాలకు సంబంధించి జేసీ ట్రావెల్స్ ఫేక్ ఇన్సూరెన్సులు సృష్టించారని, ఎన్ ఓ సీలు లేకుండా వాహనాలను నడుపుతున్నట్టుగా తెలిపారు. ముఖ్యంగా ఫేక్ ఇన్సూరెన్సులు పెట్టి వాహనాల్ని రోడ్డు పై తిప్పితే పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ అయితే , వారికీ ఇన్సూరెన్సు డబ్బులు కూడా రావని, ఇది తీవ్రమైన నేరం అని, దీనిపై అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.