Begin typing your search above and press return to search.
రేయ్.. పోతావ్ రా! : జేసీ ప్రభాకర్ సంచలన కామెంట్స్.. ఎవరినో తెలిస్తే!
By: Tupaki Desk | 25 April 2023 6:43 PM GMTజేసీ ప్రభాకర్‌రెడ్డి అంటేనే ఫైర్. రాజకీయాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా కూడా.. జేసీ ఫ్యామిలీ అంటేనే ఫైర్ బ్రాండ్‌కు కేరాఫ్. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాన్ని 40 సంవత్సరాలు పాటు శాసించిన జేసీ బ్రదర్స్.. ఇప్పుడు వివిధ కేసులతో ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు వైసీపీతో ఉన్న రాజకీయ వైరం మరింతగా ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే , మునిపల్ కౌన్సిలర్ జేసీ ప్రభాకర్ రెచ్చిపోయారు.
'రేయ్.. పోతావ్ రా!' అంటూ.. డీఎస్పీ చైతన్యపై విరుచుకుపడ్డారు. తాడిపత్రిలో డీఎస్పీ చెప్పిందే లా అండ్ ఆర్డర్ అని, మున్సిపాలిటీలోనూ డిఎస్పీ జోక్యం చేసుకుంటున్నారని ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. సోమవా రం ఇసుక అక్రమాలకు వ్యతిరకంగా నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. జేసీని గృహ నిర్బంధం చేశారు. ఈ కాక నుంచి తేరుకోని జేసీ.. పోలీసులపై తీవ్ర విమర్శలు రువ్వారు.
మునిసిపల్ కౌన్సిలర్లపై 307 కేసులు పెడుతున్నారని, డీఎస్పీ చైతన్య.. ఎమ్మెల్యే పెద్దారెడ్డికి తొత్తుగా ఉన్నారని, ఇద్దరు బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. లాలూచీతో మున్సిపాలిటీ మురికి కంపు కొడుతోందన్నారు.
"హే డీఎస్పీ ఇంకోసారి ఇంట్లోకి వస్తే చేతుల్లో ఏది ఉంటే దాంతో కొడతా... నీది చాలా ఎక్కువ అయింది.. రేయ్ ఏం దాదాగిరీ చేస్తావురా నువ్వు... పోతావ్ రా.. రేయ్ బీ కేర్ ఫుల్.. ఇంట్లోకి వస్తావా.. ఇంకొకసారి గేటు దాటిరా అరేయ్... ప్రభాకర్ రెడ్డి అంటే ఏంటో చూపిస్తా.. నీకు పొజిషన్ ఉంది... ఆ పొజిషన్ మేరకు బిహేవ్ చేయి.. నీకేం సంబంధంరా మున్సిపాలిటీ గురించి" అని జేసీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జేసీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.