Begin typing your search above and press return to search.
కొడాలి నానితో పెట్టుకున్న పవన్.. ఏం జరుగనుంది?
By: Tupaki Desk | 3 Feb 2021 4:50 AM GMTఫైర్ బ్రాండ్ నేత, ఏపీ మంత్రి కొడాలి నానిపై అనంతపురం టీడీపీ నేత జేసీ పవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కొడాలి నానితో పెట్టుకోవడానికి ఏ నేత సాహసించరు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, దేవినేని ఉమ, చంద్రబాబు, లోకేష్ లు నాని తిట్ల ధాటికి ఇబ్బందులు పడ్డవారే.. కొడాలితో పెట్టుకోవడానికే నేతలు జంకుతున్న పరిస్థితుల్లో అనంతపురం రెడ్డప్ప జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ తాజాగా ధైర్యం చేశారు. కొడాలి నానిపై విరుచుకుపడ్డారు.
మంత్రి కొడాలి నాని నోటిని ఫినాయిల్ తో కడిగి శుభ్రం చేసినా ఆయన నోటి నుంచి ఇంతకన్నా మంచి మాటలు వస్తాయని ఆశించలేమని జేసీ పవన్ హాట్ కామెంట్స్ చేశారు. విపక్ష నేతలు, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందని.. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడికి పాల్పడ్డారని జేసీ పవన్ చెప్పుకొచ్చారు.
కేంద్రం బడ్జెట్ లో ఏపీకి అన్యాయం చేసిందని.. వైసీపీ ఎంపీలు బాధ్యత వహించాలని జేసీ పవన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని.. మీడియా ముందుకొచ్చి విజయసాయిరెడ్డి తూతూ మంత్రంగా స్టేట్ మెంట్లు ఇచ్చారని విమర్శించారు.
వైసీపీ వైఫల్యం వల్ల కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని జేసీ పవన్ అన్నారు. పెట్రోల్, డీజీల్, మద్యం ధరలు పెంచి ఏపీ ప్రజలను దోచుకుంటున్నారని జేసీ ఆరోపించారు.
ప్రతిపక్షంలో ఉండి.. ఓడిపోయాక ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న జేసీ పవన్ తాజాగా బయటపడి ఏకంగా మంత్రి కొడాలితోనే పెట్టుకున్నాడు. కొడాలిని దీనికి ఏం కౌంటర్ ఇస్తాడన్నది వేచిచూడాలి.