Begin typing your search above and press return to search.
కేంద్రానికి వార్నింగ్ ఇస్తున్న టీడీపీ నేత!
By: Tupaki Desk | 28 Aug 2015 4:19 AM GMTప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ ఏమైనా ఉందంటే... అది "ప్రత్యేక హోదా"! దానివిలువ తెలిసిన వారు, అదంటే ఏమిటో తెలియని వారు.. అంతా ప్రస్తుతం దీనిగురించే చర్చించుకుంటున్నారు. రాష్ట్రానికి కేంద్రం సాయం అవసరం... అది హోదా రూపేనా అయితే ఏమిటి, ప్యాకేజీ రూపంలో అయితే ఏమిటి అని కొంతమంది చెబుతుంటే... హోదా అనేది హక్కు, ప్యాకేజీ అనేది బిక్షం.. అని మరికొందరు వాదిస్తున్నారు! ఈ విషయంలో పార్టీతో సంబందం లేకుండా.. నాయకుడి పట్టింపు లేకుండా.. ఏపార్టీలో ఉన్నా ఆ పార్టీలో రెబల్ గా గుర్తింపు తెచ్చుకునే జేసీ బ్రదర్స్ ఈ విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నారు!
రాయలసీమ విషయంలో ఎటువంటి వివక్ష చూపినా ఎవరినీ సహించేది లేదని బీజేపీ పెద్దలకు హెచ్చరికలు జారీ చేశారు. హోదా పక్కకి పోయినా, ప్యాకేజీ విషయంలో అయినా... రాయలసీమకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనేది వీరిపట్టు! ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో బీజేపీపై నోరు చేసుకునే సాహసం.. సీఎం కానీ, ఎంపీలు కానీ, సెంట్రల్ మినిస్టర్స్ కానీ చేయలేని పరిస్థితుల్లో... జేసీ బ్రదర్స్ ఇలా చెలరేగిపోవడం.. తెలియనివారికి ఆశ్చర్యంగానూ, తెలిసిన వారికి రొటీన్ గానూ కనిపిస్తుంది!
ఇదే క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదా లేక స్పెషల్ ప్యాకేజీ ఇచ్చే క్రమంలో రాయలసీమ ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అలా జరగని పక్షంలో పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తామని అటు బీజేపీని, ఇటు టీడీపీకి కలిపి జాయింట్ వార్నింగ్ ఇస్తున్నారు! ప్రస్తుతం టీడీపీ - బీజేపీ బందం బలహీనంగా ఉందనే వార్తలు వస్తున్న ఈ తరుణంలో... కేయీ, జేసీ వంటి పెద్దలు కాస్త వెనకా ముందూ ఆలోచించి మాట్లాడకపోతే.. ప్రత్యర్థి పార్టీలకు ఊతం ఇచ్చినట్లుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు!