Begin typing your search above and press return to search.
ఆ ఎమ్మెల్యే ని టెన్షన్ పెడుతున్న జేసీ
By: Tupaki Desk | 11 Nov 2018 8:59 AM GMTఅనంతపురం జిల్లాలో తాము చెప్పిందే జరగాలనుకునే జేసీ బ్రదర్స్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేకు టెన్షన్ మొదలైంది. గత ఎన్నికల్లో గుంతకల్ నుంచి పోటీ చేసి గెలుపొందిన జితేందర్ రెడ్డి సీటుకు ఈ సారి ఎర్త్ పెడుతూ కొత్త వ్యక్తిని దగ్గరకు తీస్తుండటంతో కలవరం మొదలైంది.
జేసీ దివాకర్ రెడ్డి తన ఎంపీ సీటు పరిధిలో ఆయన కోరుకున్న ఎమ్మెల్యేనే గెలుపొందాలని భావిస్తుంటారు. తాజాగా, గుంతకల్ నుంచి పోటీ చేసేందుకు మధుసూదన్ గుప్తాను రంగంలోకి దింపారు. జితేందర్ రెడ్డి స్వల్ప మెజారిటీ గెలుపొందారు. ఇక, మధుసూదన్ గుప్తా.. ఇటీవల జరిగిన జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయన వెంటే ఉన్నారు. వైసీపీకి వెంకట్రామిరెడ్డి రూపంలో రెడీ ఉండటంతో మధుసూదన్ గుప్తా ఆశలు నెరవేరే అవశాకం లేకుండా పోయింది.
దీంతో జేసీ బ్రదర్స్ అతడిని చేరదీసి గుంతకల్ నుంచి పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మధుసూదన్ రెడ్డి ఇంకా టీడీపీలో చేరలేదు. కానీ, ఆయన ప్రచారం చేసుకుంటుండంపై జితేందర్ రెడ్డి రగలిపోతున్నారు. చంద్రబాబు కూడా ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేపు పక్కన పెట్టనున్నారనే ప్రచారం ఊపందుకుంది. అనంతపురం రాజకీయాల్లో చెలరేగిన రాజకీయ దుమారం ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాల్సిందే.