Begin typing your search above and press return to search.
జగన్ జైలుకు వెళ్లే డేట్లు జేసీకి ఆయన చెప్పారట!
By: Tupaki Desk | 2 Feb 2020 4:34 AM GMTతన కింద నలుపును చూసుకోవటం గురివిందకు అస్సలు సాధ్యం కాదు. గురివిందను గుర్తు చేసేలా ఏపీ సీనియర్ నేత.. రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలో చేరిన జేసీ దివాకర్ రెడ్డి వైఖరి ప్రదర్శిస్తుంటారు. తాను చేసే తప్పుల్ని ప్రస్తావించకుండా..తన తప్పులపై చర్యలు తీసుకునే వారిపై తీవ్రమైన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇటీవల కాలంలో ఆయన చేసే వ్యాపారాల్లో తప్పుల్ని ఎత్తి చూపుతూ ఏపీ అధికారులు తీసుకుంటున్న చర్యలతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
తానేం చేసినా రైట్ అన్నట్లుగా వ్యవహరించే జేసీకి.. ఆయన వ్యాపారాల్లో ప్రభుత్వానికి జరిగే నష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎత్తి చూపటాన్ని అస్సలు సహించలేరు. ఇందుకు భిన్నంగా సాగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలకు తెగ బడుతున్నారు.
కనిపించని లోకాలకు వెళ్లిపోయిన వైఎస్ పేరును ప్రస్తావిస్తూ.. ఆయన చెప్పారంటూ దారుణ వ్యాఖ్యలు చేయటం ఈ మధ్యన జేసీకి అలవాటుగా మారింది. మా వాడు మూర్ఖుడు. ఎవరి మాటా వినడు. వాడి మూలానా రాష్ట్రమంతా నాశనమవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. జగన్ మీద విరుచుకుపడ్డారు.
మహిళలకు ముద్దులు పెట్టి.. తలలపై చేతులు పెట్టి.. అధికారంలోకి రాగానే ముంచేశాడన్నారు. జగన్ మూర్ఖుడు కావటంతోనే అతన్ని తాను బెంగళూరుకు పంపినట్లుగా వైఎస్ తనతో చెప్పినట్లుగా దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. జగన్ ను చిన్నప్పటి నుంచి చూశానని.. తనను ఎత్తుకున్న విషయాన్ని గుర్తు చేసిన జేసీ.. అందుకే మా వాడని సంబోదిస్తున్నట్లుగా చెప్పారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జగన్ త్వరలోనే జైలుకు వెళతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫిబ్రవరి 21 నుంచి మార్చి 20 లోపు జగన్ జైలుకు వెళ్లటం ఖాయమని తనకు ఒక స్వామిజీ చెప్పారన్నారు జేసీ. జగన్ కు కులగజ్జి పట్టిందని.. అందుకే అమరావతివాసులపై కక్ష సాధిస్తున్నట్లుగా వ్యాఖ్యానించిన జేసీ.. అమ్మ చెప్పినా.. చెల్లి చెప్పినా వినటం లేదన్నారు. తాత రాజారెడ్డి కలలోకి వచ్చి చెప్పాలని ప్రభువును ప్రార్థిస్తున్నట్లుగా పేర్కొన్నారు. స్వామిజీ చెప్పారని చెబుతున్న జేసీ.. తన తప్పుడు వ్యాపారాలపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటారన్న విషయాన్ని కూడా సదరు స్వామిజీ చెప్పారా? ఆ విషయం మీదా క్లారిటీ ఇవ్వొచ్చుగా జేసీ?