Begin typing your search above and press return to search.
జేసీ దివాకరరెడ్డి లవ్ స్టోరీ తెలుసా?
By: Tupaki Desk | 18 Oct 2016 5:30 PM GMT హుషారెక్కించే మాటలకు మారుపేరైన అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో నియోజకవర్గ ప్రజలతో విజిళ్లేయించుకున్నారు... అదేసమయంలో విమర్శకుల నుంచి మాటల దాడినీ ఎదుర్కొంటున్నారు. అనంతపురంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన తన చిన్నటి సంగతులు చెబుతూ అప్పట్లో తాను చేసిన అల్లరిచిల్లరి పనులన్నీ నెమరేసుకున్నారు. అంతేకాదు... తన లవ్ స్టోరీని.. తన తండ్రి వేసిన దెబ్బలను కూడా గుర్తు చేసుకున్నారు.
రాజకీయాల గురించి, అభివృద్ధి గురించి పలు విషయాలు మాట్లాడిన జేసీ ఆ తరువాత సడెన్ గా తన విద్యార్థి జీవితంలోకి వెళ్లిపోయారు. ఆ సందర్భంగా ఆయన తొమ్మిదో తరగతిలో ఓ అమ్మాయికి తాను లవ్ లెటర్ రాశానని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఆ సంగతి తెలిసి తన తండ్రి కొట్టడం మారిపోయానని చెప్పుకొచ్చారు. అనంతపురం నగర అభివృద్ధికి స్థానిక రాజకీయాలే ఆటంకంగా మారాయని ఆయన ఆరోపించారు. రేపటి నుంచి తానే స్వయంగా అనంతపురంలో చీపురు పట్టి ఊడుస్తానన్నారు.
అనంతపురంలో రోడ్లు విస్తరణ చేసేందుకు ప్రయత్నిస్తుంటే సొంత పార్టీ నేతలే అడ్డుపడుతున్నారని ఆరోపించిన జేసీ.. రాజకీయాలు కుళ్లిపోయాయని.. తాను ఇకపై పోటీచేయబోనని ప్రకటించేశారు. అనంతపురంలో రోడ్లు విస్తరించి తీరుతానన్నారు. అయితే... బాధ్యతాయుతమైన ఎంపీ హోదాలో ఉంటూ తొమ్మిదో తరగతిలో ఉండగా చేసిన చిలిపి పనులను చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. ఆయన సంగతి తెలిసిన వారు మాత్రం జేసీ అంతేలే అంటూ తేలిగ్గా తీసుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/