Begin typing your search above and press return to search.

వైసీపీలోకి వెళ్లాలని ఉంది.. జేసీ దివాకరరెడ్డి

By:  Tupaki Desk   |   20 April 2017 11:13 AM GMT
వైసీపీలోకి వెళ్లాలని ఉంది.. జేసీ దివాకరరెడ్డి
X
ఏపీ సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఎంపీ జేసీ దివాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో టీడీపీలో చేరానని చెప్పారు. జగన్ పార్టీలోకి వెళ్లాలనే తనకు ఉందని, కానీ... చంద్రబాబు సామర్థ్యాలు తెలిసి ఈ పార్టీలోకి వచ్చానని అన్నారు. అనంతపురం జిల్లా పామిడిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన తనదైన శైలిలో ప్రసంగించారు. ముఖ్యంమంత్రిని "చిరంజీవి చంద్రబాబునాయుడు.." అంటూ సంబోధించారు. అందుకు కారణం కూడా చెప్పారు... చంద్రబాబు 68వ ఏట అడుగుపెట్టారని.. తనకేమో 72 సంవత్సరాలు.. అందుకే అలా సంబోధించానని చెప్పారు.

నీటి విషయంలో చంద్రబాబు చేస్తున్న కృషి గొప్పగా ఉందని... ప్రజలంతా మెచ్చుకుంటున్నారని జేసీ చెప్పుకొచ్చారు. హంద్రీనీవా నీటిని మూడు నెలల్లో తెస్తామని చంద్రబాబు చెప్పడాన్ని ప్రస్తావిస్తూ, ఈ పని జరగాలంటే అధికారుల నుంచి కాంట్రాక్టర్ల వరకూ, అంతకుమించి దేవుడి ఆశీస్సులు కావాలని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఇవాళ ఉన్న నేతల్లో ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని జేసీ అన్నారు. తాను టీడీపీలో చేరడానికి కూడా అదే కారణమని చెప్పారు. అంతే తప్ప చంద్రబాబు మంత్రి పదవి ఇస్తారన్న ఆశతో టీడీపీలో చేరలేదని చెప్పారు. ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నారో తెలియదుగానీ, రాష్ట్రానికి చంద్రబాబు మంచి చేస్తున్నారని.. నీళ్ల కోసం అడిగితే 'యస్' అంటారని చెప్పారు. చంద్రబాబు చెప్పిన పనులన్నీ చేస్తే, నిజంగా అనంత జిల్లా సస్యశ్యామలం అవుతుందని, అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. అప్పో సప్పో చేసి, బంగపోయో, బతిమాలో ఈ పనులను జరిపించాలని, ఈ పనులు ఇప్పుడు కంప్లీట్ అవుతాయన్న నమ్మకం తనకు లేదని, మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే, అప్పటికి నీరు వస్తుందని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

ఇలా కొంత నమ్మకం, మరికొంత అపనమ్మకం వ్యక్తంచేసిన జేసీ ఆ తరువాత తన మనసులోని మాటను చెప్పారు. అందరిలాగానే తనకూ కులాభిమానం ఉందని.. తనకూ జగన్ పార్టీలోకే వెళ్లాలని ఉన్నా అధికారంలో ఉన్న చంద్రబాబు వల్ల అభివృద్ధికి అవకాశం ఉంటుందన్న కారణంతో టీడీపీలో ఉన్నట్లు చెప్పారు. జేసే వైఖరిని చూసినవారు ఏ రోటికాడ ఆ పాట పాడడంలో జేసీని మించినవారు లేరని అంటున్నారు. అంతేకాదు.. ఆయన చంద్రబాబును పొగిడాడా.. తిట్టాడా అర్థం కావడం లేదని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/