Begin typing your search above and press return to search.

ఆయ‌న వ‌ల్లే జ‌గ‌న్ గెలుపు...టీడీపీ నేత సంచ‌ల‌నం

By:  Tupaki Desk   |   15 Oct 2019 1:30 PM GMT
ఆయ‌న వ‌ల్లే జ‌గ‌న్ గెలుపు...టీడీపీ నేత సంచ‌ల‌నం
X
సినిమా ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాస్ప వ్యాఖ్య‌లు చేస్తూ ఎలా వార్త‌ల్లో ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌తారో ? ఇటు టీడీపీ సీనియ‌ర్ నేత‌ - మాజీ ఎంపీ జేసీ.దివాక‌ర్‌ రెడ్డి సైతం అంతేలా ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీ వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలిచేందుకు ఇష్ట‌ప‌డుతూ ఉంటారు. ఇక ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి విష‌యంలోనూ జేసీ దూకుడుగానే వ్యాఖ్య‌లు చేస్తూ ఉంటారు. జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్‌ పై తీవ్ర‌మైన ప‌ద‌జాలంతో విరుచుకుప‌డిన జేసీ... జ‌గ‌న్ సీఎం అయ్యాక మార్చేశారు.. జ‌గ‌న్‌ కు పాజిటివ్‌ గా చిల‌క ప‌లుకులు ప‌లికేస్తున్నారు

ఇక తాజాగా మ‌రోసారి జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం జగన్ పరిపాలన గురించి చెప్పాలంటే మరో ఆరు నెలల గడువు కావాలని ఆయన తెలిపారు. ఇక జ‌గ‌న్‌ కు ప‌రిపాల‌నా అనుభ‌వం లేద‌ని చెప్పిన జేసీ... ఆయ‌న‌కు మంచి - చెడు చెప్పేవారే లేర‌ని.. జ‌గ‌న్ తాను ప‌ట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇక జ‌గ‌న్ కేవ‌లం ప్ర‌ధాన‌మంత్రి మోదీ మంత్ర‌దండం వ‌ల్లే అధికారంలోకి వ‌చ్చార‌ని కూడా జేసీ సంచ‌ల‌నం రేపారు.

ఏదేమైనా మ‌రోసారి జేసీ తాను చెప్పాల‌నుకున్న విష‌యాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్ విష‌యంలో ఆచితూచి మాట్లాడుతోన్న జేసీ ఇప్పుడు మోదీ కార‌ణంగానే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాడ‌న‌డం ఆస‌క్తిక‌ర‌మే. ఇక జేసీ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నేత‌ల కౌంట‌ర్లు ఎలా ? ఉంటాయో ? చూడాలి. ఇదిలా ఉంటే టీడీపీలో ఉండేందుకు జేసీ వార‌సులు ఆస‌క్తితో లేక‌పోవ‌డంతో జేసీ రాజ‌కీయంగా ఆ పార్టీ నుంచి ఎలా ? బ‌య‌ట‌పడాలా ? అన్న ఆలోచ‌న‌తో కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది.