Begin typing your search above and press return to search.

బాబు గారు మీరు నోర్మూసుకోండి

By:  Tupaki Desk   |   17 Dec 2019 2:30 PM GMT
బాబు గారు మీరు నోర్మూసుకోండి
X
ఈ మధ్య అసెంబ్లీకి వచ్చిన అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమయ్యారట.. ఈ భేటి వివరాలు ఆలస్యంగా పొక్కాయి. వీరి మధ్య జరిగిన సంభాషణలో ప్రధానంగా చంద్రబాబు తీరును జేసీ తప్పుపట్టినట్లు తెలిసింది.

జగన్ తప్పులను ప్రతీసారి మీడియా ఎదుట.. అసెంబ్లీలో వేలెత్తిచూపుతున్న చంద్రబాబు తీరును జేసీ నిర్మొహమాటంగా తప్పుపట్టారట.. మీరు కాస్తా సైలెంట్ గా ఉండాలని హితబోధ చేశారట..

‘జగన్ ఎన్ని తప్పులు చేస్తే అంత మంచిది. మీరెందుకు తొందరపడి చెబుతున్నారు. ఓటేసిన ప్రజలకు కూడా నొప్పి తెలియాలి కదా’ అని చంద్రబాబుతో జేసీ కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది.

ఇక గ్రామాల్లో ఫ్యాక్షన్ ఎక్కువైపోయిందని.. టీడీపీ వాళ్లు ఉండలేకపోతున్నారని జేసీ చెప్పుకొచ్చాడట... ‘జగన్ ఎన్ని తప్పులు చేస్తే అంతా మనకి మంచిదేనని.. ఒకసారి గెలిపిస్తే జనానికి అర్థమవుతోందని.. పూర్తి సినిమా అర్థం కావాలి కదా.. మీరు వెయిట్ చేయండ’ని చంద్రబాబుకు గట్టిగా జేసీ క్లాస్ పీకినట్టు తెలిసింది.

ప్రతిపక్ష నేతగా జగన్ తప్పులు ఎత్తిచూపడం నా బాధ్యత అని చంద్రబాబు వివరిస్తుంటే.. అందుకే మిమ్మల్ని ప్రతిపక్ష నేతను చేశారని జేసీ ఈసడించుకున్నారట.. ‘‘టీడీపీకి 23 సీట్లు ఇచ్చిన జనాలు.. వైసీపీకి 151 సీట్లు ఇచ్చారు. మీకంటే ఓట్లేసిన వారికే బాధ్యత ఎక్కువ ఉంటుంది.. సక్రమంగా వైసీపీ పాలించకపోతే జనాలే దెబ్బ కొడతారు’’ అని జేసీ వివరించాడట.. జగన్ పాలనపై తొందరపడుతున్న బాబు ముందరికాళ్లకు జేసీ ఇలా బంధం వేశాడట..