Begin typing your search above and press return to search.
జేసీ దివాకర్ రెడ్డి అరెస్టు తప్పదా?
By: Tupaki Desk | 17 Oct 2019 6:55 AM GMTమొన్నామధ్య వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసించాడు జేసీ దివాకర్ రెడ్డి. తాజాగా ప్లేటు ఫిరాయించారు. జగన్ కు అనుభం లేదన్నారు. ఇలా ఆయన మాట మార్చడం వెనుక కథ వేరే ఉందని స్పష్టం అవుతోంది. తాజాగా జేసీ దివాకర్ రెడ్డి ట్రవెల్స్ కు సంబంధించిన కొన్ని బస్సులను సీజ్ చేశారు.
ఇరవై మూడు బస్సులను సీజ్ చేసినట్టుగా ఆర్టీఏ అధికారులు ప్రకటించారు. ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ సర్వీసుల పర్మిట్లను అధికారులు రద్దు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ బస్సులను నడుపుతున్నందున అధికారులు చర్యలు తీసుకున్నారు.
రవాణాలో జేసీ దివాకర్ రెడ్డి దందా గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. పర్మిట్లు తెచ్చుకునేది ఒక చోట - నడిపేది మరో చోట. ఎప్పటికప్పుడు అధికార పార్టీల్లో ఉంటూ జేసీ సోదరులు తమ బస్సులను యదేచ్చగా నడిపించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా వారు కొంత కాలంగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు.
అయితే ఏపీలో జగన్ ప్రభుత్వం మాత్రం ఈ విషయాలను వదిలేలా లేదు. జగన్ ను దివాకర్ రెడ్డి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినా.. అటు నుంచి మాత్రం సానుకూల సంకేతాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో దివాకర్ రెడ్డి బస్సుల సీజ్ ఆసక్తిదాయకంగా మారింది.
దివాకర్ రెడ్డి పేరుతోనే ఆయన బస్సు సర్వీసులన్నీ నడుస్తూ ఉంటాయట. ఈ నేపథ్యంలో అక్రమాలకు దివాకర్ రెడ్డిని అరెస్టు చేసినా చేయొచ్చనే ప్రచారం జరుగుతూ ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వర్గాల్లో ఈ మేరకు ప్రచారం సాగుతూ ఉంది. దివాకర్ రెడ్డిని అరెస్టు చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.