టీడీపీ మాజీ ఎంపీ, రాయలసీమ రాజకీయాలలో కీలక నేతగా గుర్తింపు సంపాదించుకున్న జేసీ దివాకర్ రెడ్డి అవినీతి బాగోతం తాజాగా బయటపడింది. అనంతపురంలో జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని, వేల సంఖ్యలో ఉద్యాగాలు కల్పిస్తామని ప్రజలను మభ్య పెట్టి మోసానికి పాల్పడట్టు తెలుస్తోంది. అలాగే , దీనితో పాటుగా తన ఇంట్లోని పని మనుషులు, డ్రైవర్ల పేర్ల తో త్రిశూల్ సిమెంట్స్ కు అనుమతులు పొందారు. అలాగే రూ. 200 కోట్లు విలువ చేసే సున్నపురాయి గనులను అక్రమంగా విక్రయానికి పాల్పడట్టు వెలుగులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి అవినీతి పై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. జేసీ దివాకర్ రెడ్డి అవినీతి బయటకు రావడంతో త్రిశుల్ సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతులను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంతరం త్రిశుల్ భూములను వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, స్థానిక అఖిలపక్ష నేతలు పరిశీలించారు. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ అవినీతి పై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. మరోవైపు ఆయన పై హైకోర్టు లో నమోదు అయిన కేసు లో 10న తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది.
కాగా , ఇకపోతే కొనుప్పలపాడులో 649.86 హెకార్ట సున్నపురాతి గనుల లీజు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. అలాగే సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి, మరో ఐదేళ్ల పొడిగింపు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ముందడుగు వేయనందున ప్లాంట్ నిర్మాణానికి ఇచ్చిన లీజు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వి బయటకి తీసి , ఇతర ప్రాంతాలకి చేయడం పై విచారణ కొనసాగుతుందని ఏపీ సర్కార్ తెలిపింది.