Begin typing your search above and press return to search.

నేటి రాజ‌కీయాల్లో ఇమ‌డ‌లేకే రాజీనామా:జేసీ

By:  Tupaki Desk   |   21 July 2018 8:36 AM GMT
నేటి రాజ‌కీయాల్లో ఇమ‌డ‌లేకే రాజీనామా:జేసీ
X
అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌బోతున్నార‌న్న వార్త గ‌త రెండు రోజులుగా హ‌ల్ చ‌ల్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం నాడు పార్ల‌మెంటులో ఎన్డీఏ స‌ర్కార్ పై టీడీపీ ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం త‌ర్వాత జేసీ రాజీనామాపై త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌బోతున్నార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో నిన్న సాయంత్రం ఓ తెలుగు న్యూస్ చానెల్ ప్ర‌తినిధితో మాట్లాడిన జేసీ త‌న రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు. తాను హ‌ఠాత్తుగా రాజ‌కీయాల్లో నుంచి త‌ప్పుకోవాల‌నుకోవ‌డం లేద‌ని చాలాకాలంగా ఆ విష‌యం గురించి ఆలోచిస్తున్నాన‌ని జేసీ అన్నారు. త‌న‌ రాజీనామాకు త‌న కుమారుడు ప‌వ‌న్ రెడ్డి రాజ‌కీయ అరంగేట్రానికి సంబంధం లేదని జేసీ క్లారిటీ ఇచ్చారు. ప‌వ‌న్ రెడ్డి స‌మ‌ర్థుడ‌నిపిస్తే...టికెట్ ఇస్తార‌ని.....ప్ర‌జ‌లు గెలిపిస్తార‌ని - లేదంటే లేద‌ని....జేసీ కుమారుడు కాబ‌ట్టి టికెట్ ఇవ్వ‌ర‌ని అన్నారు. అయితే, తాను ఎపుడు రాజీనామా చేసేది త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాన‌ని....మీడియాకు త‌ప్ప‌క తెలియజేస్తాన‌ని జేసీ అన్నారు. ఆ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా జేసీ అనేక సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు.

రోజు రోజుకీ రాజ‌కీయాల్లో దిగ‌జారుడుత‌నం ఎక్కువైందని - అందువ‌ల్ల తాను మ‌న‌స్తాపం చెందాన‌ని జేసీ అన్నారు. ఆ కార‌ణంతోనే చాలాకాలంగా రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పాల‌నుకుంటున్నాన‌ని అన్నారు. కేంద్రంలో - రాష్ట్రంలో రాజ‌కీయాలు క‌లుషిత‌మ‌య్యాయ‌ని, అందుకే ఈ పొల్యూటెడ్ రాజ‌కీయాల‌ నుంచి త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని అన్నారు. నేటి రాజ‌కీయాల్లో నేను ఇమ‌డ‌లేనేమో అనిపిస్తోంద‌ని - ఇప్ప‌టికే 40 ఏళ్ల పాటు రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని - అందుకే రిటైర్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని చెప్పారు. 1972 నుంచి రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని....ఇపుడు వ‌య‌సు మీద ప‌డిందని అన్నారు. మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల దృష్ట్యా స్వ‌చ్ఛందంగా త‌ప్పుకోవ‌డం మంచిద‌ని భావించే ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని అన్నారు. ప‌వ‌న్ రెడ్డి కోస‌మే తాను రాజీనామా చేస్తున్నాన‌న్న వార్త‌ల్లో నిజం లేద‌న్నారు. తాను ఎపుడు రాజీనామా చేయ‌బోయేది త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాన‌ని - మీడియాకు తెలియ‌జేస్తాన‌ని జేసీ అన్నారు.