Begin typing your search above and press return to search.

మా కుటుంబంపై జగన్ ప్రయోగించింది అదే: జేసీ

By:  Tupaki Desk   |   14 Jun 2020 9:45 AM GMT
మా కుటుంబంపై జగన్ ప్రయోగించింది అదే: జేసీ
X
మా కుటుంబంపై ఏపీ సీఎం జగన్ పగబట్టారని ఆరోపించారు మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. తన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిల అరెస్టుల నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి మీడియా సమవేశం నిర్వహించారు. తమ కుటుంబంపై సీఎం జగన్ రాయలసీమ ఫ్యాక్షన్ ప్రయోగించారని జేసీ వాపోయారు. ఆర్తిక మూలాలు దెబ్బతీసి, ఎదుటివాడిని అడుక్కుతినే స్థాయికి తీసుకురావడమే రాయలసీమ ఫ్యాక్షన్ లక్ష్యమని.. దానినే తన కుటుంబపై ప్రయోగించారని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనకున్న బస్సులు, లారీల గురించి తనకు తెలియదని జేసీ వివరణ ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి శిద్ధా రాఘవరావుపై రూ.400 కోట్లు జరిమానా వేయడంతోనే ఆయన టీడీపీనీ వీడి వైసీపీలోకి వచ్చారని ఆరోపించారు.

తమ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టి అరెస్టులు చేసినా అదరం బెదరం అని.. టీడీపీని వీడేది లేదని.. వైసీపీలో చేరమని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మా తమ్ముడు ప్రభాకర్ రెడ్డి అప్పట్లో సాక్షి పత్రికాఫీసు ముందు ఆందోళన చేసినప్పుడు జగన్ కుటుంబాన్ని ఏదో అన్నాడట.. బూతులతో దారుణంగా మాట్లాడాడట.. ఆ కక్షను మనసులో పెట్టుకొనే జగన్ తమపై రాయలసీమ ఫ్యాక్షన్ ను ప్రయోగించాడని జేసీ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ఒక్క నరేంద్రమోడీకి మాత్రమే భయడపడుతాన్నారు. చంద్రబాబు జోలికి పోలేడని.. పోతే భస్మమైపోతాన్నారు.

ఇక జేసీ కుమారుడు పవన్ రెడ్డి సైతం మండిపడ్డారు. మీ చర్యలకు ప్రతిచర్యలుంటాయని.. ఏపీలో కనీసం 10-15 మంది మాజీ మంత్రులు, కీలక నేతలను అరెస్ట్ చేయాలన్నదే జగన్ కుట్ర అని ఆరోపించారు.