Begin typing your search above and press return to search.
నోటి దూలకు జేసీ దివాకర్ రెడ్డి మూల్యం చెల్లించుకోవాల్సిందేనా!
By: Tupaki Desk | 3 May 2019 2:30 PM GMTఈ ఎన్నికల్లో ఫలానా అభ్యర్థి డబ్బు ఖర్చు పెట్టలేదు.. అని చెప్పడానికి ఎవరూ లేరు. రాజకీయ నేతలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారనే నిజం ప్రజలకూ తెలుసు. రాజకీయ నేతలకు తెలుసు. మీడియాకు తెలుసు. అందరికీ తెలుసు. ఇదంతా ముసుగులో గుద్దులాట లాంటి వ్యవహారం.
పైకి అయితే అంతా బాగా జరిగింది. కానీ ప్రతి నియోజకవర్గంలోనూ రాజకీయ పార్టీలో కొన్ని వేల ఓట్లకు డబ్బులు ఇచ్చాయి. కొనుక్కొన్నాయి. పోలింగ్ కు ముందు ప్రలోభాలు తీవ్ర స్థాయిలో జరిగాయి. ఇది ఎవరికీ తెలియని అంశం కాదు.
అయితే ఈ అంశం గురించి తన నోటి తీట కొద్దీ తెలుగుదేశం నేత , ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒకింత తీవ్ర పరిణామాలకే దారి తీసేలా ఉన్నాయి. ఇటీవలే దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో నెగ్గడానికి భారీగా ఖర్చు చేసినట్టుగా చెప్పారు. తామే యాభై కోట్ల రూపాయల వరకూ ఖర్చు పెట్టినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. అది జనరలైజ్ స్టేట్ మెంట్ లాగానే ఉన్నా, ఒక దశలో తామే అంత ఖర్చు పెట్టినట్టుగా దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. జేసీ దివాకర్ రెడ్డి మాటలపై అప్పట్లోనే వివిధ పార్టీల వారు ఫిర్యాదులు చేశారు. దీంతో ఈ అంశం మీద ఎన్నికల సంఘం స్పందించాల్సి వచ్చింది.ఎన్నికల సంఘం తరఫున అనంతపురం ఎంపీ వీరపాండ్యన్ జేసీ దివాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.
భారీ స్థాయిలో ఖర్చు పెట్టి ఎన్నికల్లో నెగ్గడానికి ప్రయత్నాలు చేసినట్టుగా ఆయన బాహాటంగా ఒప్పుకున్న నేపథ్యంలో.. ఆయన వివరణను కోరుతున్నట్టుగా ఆ నోటీసులు ఉన్నాయని సమాచారం. ఈ నోటీసులు ఇంకా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయనేది ఆసక్తిదాయకమైన అంశం అవుతోంది.
ఏదేమైనా తన నోటి తీటతోనే దివాకర్ రెడ్డి ఈ వివాదంలో ఇరుక్కున్నారు. మరి నోటీసులకు ఏమని సమాధానం ఇస్తారో, ఏదో నోటీ తీట కొద్దీ అలా అన్నట్టుగా వివరణ ఇచ్చుకుంటారేమో!