Begin typing your search above and press return to search.

త‌న ఎదుట ప‌డిన సోనియాను జేసీ ఏమ‌న్నారంటే?

By:  Tupaki Desk   |   20 July 2018 9:32 AM GMT
త‌న ఎదుట ప‌డిన సోనియాను జేసీ ఏమ‌న్నారంటే?
X
మోడీపై అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌కు పార్ల‌మెంటు సాక్ష్యంగా నిలిచింది. గ‌డిచిన మూడు..నాలుగు రోజులుగా తెలుగు మీడియాలో వార్త‌ల్లో క‌నిపించిన టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి.. త‌న తీరుతో మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. లోక్ స‌భ వ‌ద్ద జేసీకి కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ ఎదుట ప‌డ్డారు.

ఈ సంద‌ర్భంగా ఆమెకు దండం పెట్టిన జేసీ.. త‌ల్లీ రాష్ట్రాన్ని విభ‌జించావ్‌.. రెడ్ల‌కు తీర‌ని అన్యాయం చేవావ్‌.. కాంగ్రెస్ ను న‌మ్ముకొని తెలుగు రాష్ట్రాల్లోని రెడ్లు నిలువునా మునిగారు అంటూ వ్యాఖ్యానించారు. జేసీ మాట‌ల‌కు చిన్నగా న‌వ్విన సోనియా.. ముందుకు వెళ్లారు.

సోనియ‌మ్మ‌కు జేసీ కొత్తేం కాదు. కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ నేత‌గా ఆమెకు సుప‌రిచితుడు. విభ‌జ‌న కార‌ణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెడ్లకు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌న్న వాద‌న‌ను జేసీ వ్య‌క్తం చేస్తుంటారు. రెడ్ల అధిప‌త్యాన్ని విభ‌జ‌న గండి కొట్టింద‌ని.. కోలుకోలేకుండా దెబ్బ తీసింద‌ని.. రాజ‌కీయంగా రెడ్లు భారీగా న‌ష్ట‌పోయార‌న్న మాట‌ను ఆయ‌న ప‌దే ప‌దే చెబుతుంటారు. తాజాగా మ‌రోసారి.. అదే మాట‌ను సోనియ‌మ్మ ముఖం మీద‌నే చెప్పార‌ని చెప్పాలి.