Begin typing your search above and press return to search.

ఆ ఎంపీ జ‌గ‌న్ ను ఎన్ని మాట‌ల‌న్నాడో తెలుసా?

By:  Tupaki Desk   |   2 Jan 2017 4:52 PM GMT
ఆ ఎంపీ జ‌గ‌న్ ను ఎన్ని మాట‌ల‌న్నాడో తెలుసా?
X
స‌హ‌జంగా వ‌య‌సు పెరుగుతున్న కొద్ది అనుభ‌వం - సంయ‌మ‌నం- స్థిత‌ప్ర‌జ్ఞ‌త‌ పెరగాల్సి ఉంటుంది. కానీ కొంద‌రిని చూస్తే అలాంటి పురోగ‌తి ఏమీ లేద‌ని పైగా...రానురాను మ‌రింత‌గా స్థాయి త‌గ్గించుకుంటున్నార‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతుంటుంది. తాజాగా అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి వ్యాఖ్య‌లను చూసిన వారు ఇలాంటి కామెంట్ల‌నే చేస్తున్నారు. త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేయ‌డంలో ముందుండే జేసీ తాజాగా ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ పై ప‌రుష ప‌దాల‌తో మండిప‌డ్డారు. పైగా త‌న‌కు చనువు ఉంద‌ని స‌ర్దిచెప్పుకున్నారు. ఇదంతా పార్టీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో కావ‌డం ఆస‌క్తిక‌రం.

క‌ర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబున్న వేదిక మీదే జ‌గ‌న్‌ ను తీవ్రంగా దుయ్య‌బట్టారు. త‌న‌కు జ‌గ‌న్ ముందు నుంచే తెలుసు కాబ‌ట్టి చ‌నువుగా మాట్లాడుతున్నాన‌ని చెప్పిన జేసీ జ‌గ‌న్ తిక్క ముండా కొడుకు అంటూ వ్యాఖ్యానించారు. పైగా జ‌గ‌న్‌ కు తిట్లు త‌ప్ప మ‌రేం చాత‌కాద‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌ల కోసం పాటుపడాల‌నే నాయ‌కుడు సంక్షేమ ప‌థ‌కాల‌ను - ప‌ట్టిసీమ వంటి ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టును వ్య‌తిరేకిస్తారా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లంతా పోల‌వ‌రం - అమ‌రావ‌తిని కోరుకుంటుంటే జ‌గ‌న్ మాత్రం వాటిని వ్య‌తిరేకిస్తున్న తిక్క నాయాల అంటూ ఊగిపోయి విమ‌ర్శించారు. చంద్రబాబు లాంటి పరిపాల‌న ద‌క్షుడు లేనే లేర‌ని ప్ర‌శంసించారు.

ఈ మాట‌ల‌ను విన్న చంద్ర‌బాబు జేఏసీ ఆగ్ర‌హాన్ని సరిదిద్దుకునే ప్ర‌యత్నం చేశారు. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడే త‌త్వం జేసీ సొంత‌మ‌ని పేర్కొన్నారు. అలాంటి కామెంట్ల వ‌ల్ల త‌న‌కు సైతం ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని ప‌రోక్షంగా ఝ‌ల‌క్ ఇచ్చారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/