Begin typing your search above and press return to search.
బీజేపీ నేతలది మిడిమిడి జ్ఞానం: జేసీ
By: Tupaki Desk | 12 Jan 2018 10:26 AM GMTసంచలన వ్యాఖ్యలు - వివాదాస్పద కామెంట్లకు పెట్టింది పేరయిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు అదే రీతిలో వ్యాఖ్యలు చేశారు. అవసరాన్ని - సందర్భాన్ని బట్టి సీఎం చంద్రబాబునాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ ఇస్తారని ప్రధాని తీరుపై అసహనం వ్యక్తం చేసిన రెండ్రోజులకే...టీడీపీ-బీజేపీ పొత్తుపై ఆయన స్పందించారు. అయితే కేంద్రాన్ని దువ్వుతూనే...ఏపీ బీజేపీ నేతలపై జేసీ దుమ్మెత్తిపోయడం గమనార్హం.
తాజాగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీకి మొత్తం కేంద్రమే సహాయం చేస్తోందన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. మిడిమిడి జ్ఞానంతో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని జేసీ మండిపడ్డారు. ఎక్కువ సీట్లు బీజేపీ నేతలు అడగడం మంచి కాదన్నారు. అలాగే.. సీఎం చంద్రబాబు కూడా ఎక్కువ సీట్లు బీజేపీకి ఇవ్వకూడదన్నారు. ఎన్ని గొడవలు ఉన్నా కలిసే పోటీ చేస్తామన్న నమ్మకం ఉందన్నారు. కేంద్రం ఏపీ పట్ల సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యసాధకుడన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినవన్నీ సాధించుకుంటారని వ్యాఖ్యానించారు.
కాగా, ఏపీ ఎంపీలతో రైల్వే జీఎం సమావేశం అనంతరం కూడా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇవే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని కొందరు తమను కరివేపాకులా వాడుకుంటున్నారని విమర్శించారు. రై ల్వే జోన్ విషయంలో ఎంపీలు చేసేదేమీ లేదని..చెయ్యెత్తమంటే ఎత్తాలి..దించమంటే దించాలి చందంగా ఉందన్నారు. భయం లేకపోతే విచ్చలవిడి తనం వస్తుందన్నారు. అవసరం ప్రాతిపదికనే బాబు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇస్తున్నారని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.