Begin typing your search above and press return to search.
ప్రత్యేక హోదా రాదు..జేసీ సంచలనం
By: Tupaki Desk | 1 Sep 2015 10:12 AM GMTఅనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ర్ట వ్యాప్తంగా అధికార, ప్రతిపక్షాల మధ్య అసెంబ్లీ సాక్షిగా యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే దీన్ని సెంటిమెంట్ గా తీసుకుని ముగ్గురు వ్యక్తులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు..ఇన్ని జరుగుతుంటే జేసీ మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా రాదని తేల్చిచెప్పారు. మంగళవారం ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే జేసీ పక్కనే అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి విలేకర్లతో మాట్లాడారు.
జగన్మోహన్ రెడ్డి పోరాడి ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానంటే తాను ఇప్పుడే రాజీనామా చేస్తానన్నారు. తనతో పాటు మరో 10 మంది ఎంపీలను కూడా రాజీనామా చేయిస్తానని జేసీ సవాల్ చేశారు. ఒకవేళ ప్రత్యేక హోదా రాకపోతే రాజీనామా చేసిన వాళ్లందరిని పోటీలేకుండా రాజకీయపార్టీలన్ని కలిసి లోక్ సభకు పంపుతాయా అని జేసీ ప్రశ్నించారు.
ఏపీకి ప్రత్యేక హోదా రాదని డిసైడైపోయిందని..కాకుంటే బీహార్ కంటే మెరుగైన ప్యాకేజీ మాత్రం వచ్చే అవకాశాలున్నాయన్నారు. దీనిపై మన నాయకులు మరింత గట్టిగా ఫైట్ చేస్తే ఇంకా మెరుగైన ప్యాకేజీ పొందవచ్చన్నారు. అలాగే సీఎం చంద్రబాబును జగన్ ఔట్ డేటెడ్ నాయకుడు అని వ్యాఖ్యానించడంపైనా జేసీ స్పందించారు. జగన్ చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజమే అని...ఎందుకంటే జగన్ కు ఉన్నంత కోపం..దూకుడు చంద్రబాబులో లేవని అందుకే ఆయన ఔట్ డేటెడ్ నాయకుడని జగన్ పై వ్యంగ్యాస్ర్రాలు సంధించారు.
ఏదేమైనా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టే జేసీ దివాకర్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా రాదని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మొన్న సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత దీనిపై అనుమానాలు బలపడ్డాయి. ఇప్పుడు జేసీ కూడా ఇదే విషయాన్ని బల్లగుద్దినట్టు చెప్పడంతో ప్రత్యేక హోదా విషయంలో నీలినీడలు కమ్ముకున్నాయి.