Begin typing your search above and press return to search.
మూడు కాకపోతే.. పది రాజధానులు పెట్టుకోవచ్చు.. జేసీ
By: Tupaki Desk | 9 March 2022 2:30 PM GMTఏపీలో రాజధానుల అంశం, తెలంగాణలో ఉద్యోగాల ప్రకటన.. వంటి కీలక అంశాలపై అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ.. ఫైర్ బ్రాండ్ జేసీ దివాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించిన ఉద్యోగాల గురించి మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా ఈ రేంజ్‌లో ఓకే సారి.. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రకటన ఎవరూ చేయలేదన్నారు. ఇది రాజకీయ మైలేజీకి మాత్రమే కాకుండా.. రాష్ట్ర అభివృద్ధికి కూడా దోహద పడుతుందని.. అందరిలోనూ నెలకొన్న అసంతృప్తిని తగ్గించడం ఖాయమని అన్నారు.
ఇక, ఏపీలో మూడు రాజధానులు పెట్టుకున్నా.. పది రాజధానులు పెట్టుకున్నా.. వారి ఇష్టమని.. ఇంకా మా(జగన్) ప్రభుత్వానికి రెండేళ్ల సమయం ఉందని దివాకర్ చెప్పుకొచ్చారు. మంత్రి బొత్స సత్యనారాయణ మళ్లీ హైదరాబాద్ వెళ్లాలనుకుంటున్నారని.. ఇది తప్పేంకాదని.. అక్కడ.. ఇక్కడ రెండు చోట్లా కూడా ఉండే అవకాశం ఉందన్నారు.
తమకు ఇంకా రెండేళ్లు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అయితే.. సెక్రటేరియెట్‌ను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేశారు .. కదా.. అంటే.. తిరిగితీసుకునే హక్కు ఉందని చెప్పారు.
అక్కడ ఉండొచ్చు.. ఇక్కడ ఉండొచ్చని.. కేంద్రం చెప్పినట్లు ఏపీకి ఆ అవకాశం ఉందన్నారు జేసీ దివాకర్ రెడ్డి. హైదరాబాద్‌లో ఏపీకి కూడా రెండేళ్లు హక్కు ఉందని.. మహా, మహా మేధావులు కలిసి మూడు రాజధా నులు పెట్టారన్నారు. ఒకటి కాదు పది రాజధానులు పెట్టుకోని.. అది 'మా' సీఎం జగన్ ఇష్టం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మంత్రి బొత్స ప్రకటన బట్టి చూస్తే మూడు రాజధానుల అంశాన్ని సీఎం జగన్ వదిలేసినట్లే కనిపిస్తోందన్నారు. అందుకే బొత్స హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు.
ఇక, తెలంగాణలో మాదిరిగా. ఏపీలోనూ ఉద్యోగాల ప్రకటన ఉంటుందా? అన్న ప్రశ్నకు.. ఏపీలో జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవని.. ఇక, ఉద్యోగాల మాట ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లినా వీలు కాలేదని.. అపాయింట్‌మెంట్ ఓకే అయితే పిలుస్తామని చెప్పినట్లు తెలిపారు. సీఎంలను కలిసేందుకు పరిస్థితి ఒకప్పటిలా లేదని.. ఏపీలో మంత్రులకే సీఎం అపాయింట్‌మెంట్ ఉండటం లేదన్నారు.