Begin typing your search above and press return to search.
బోరుమంటున్న దివాకర్ రెడ్డి.. నరికి చంపాలట!
By: Tupaki Desk | 2 Feb 2020 6:41 AM GMTఅక్రమ పద్ధతిలో నడుస్తున్న తన బస్సులను సీజ్ చేయడం కూడా తన పై కక్ష సాధింపు చర్యలే అని అంటున్నారు తెలుగుదేశం నేత జేసీ దివాకర్ రెడ్డి. గత రెండు దశాబ్దాల్లో జేసీ బస్సుల సామ్రాజ్యం భారీగా విస్తరించింది. ఆ కాలంలో అంతా ఆయన ఏదో రకంగా అధికార పార్టీలోనే ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ లో పదేళ్లు, ఆ తర్వాత టీడీపీలో ఐదేళ్లు. ఇలా దివాకర్ రెడ్డి అధికార పార్టీ నేతగా చలామణి అయ్యారు. దీంతో సహజంగానే అప్పుడు ఆయన బస్సులు అక్రమ పద్ధతిలో నడుస్తున్నా అడ్డుకునే నాథుడు లేకుండా పోయి ఉండవచ్చు. ఇప్పుడు జేసీ చేతిలో పవర్ లేదు. దీంతో ఆయన బస్సులకు బ్రేకులు పడి ఉండవచ్చు. ఇలాంటి నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు జరిగిన అన్యాయంపై బోరు మన్నారు.
ఇప్పటి వరకూ దివాకర్ ట్రావెల్స్ కు సంబంధించి 84 బస్సులను సీజ్ చేశారు.. అని ఆయన అమరావతి రైతులకు చెప్పుకున్నారు. అమరావతి రైతులను కలిసి సంఘీభావం ప్రకటించిన జేసీ తనకు జరిగిన అన్యాయంతో పోలిస్తే రైతులకు జరిగిన అన్యాయం ఏ మూలకూ కాదని వ్యాఖ్యానించారు. తనతో పోలిస్తే వారికి జరిగిన అన్యాయం సముద్రం లో నీటి బొట్టంత అని జేసీ చెప్పుకొచ్చారు.
తాజాగా జేసీకి సంబంధించి త్రిశూల్ సిమెంట్స్ కు సంబంధించి కూడా అనుమతులు రద్దు అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల తో అది జరిగింది. ఈ నేపథ్యంలో తనకు చాలా అన్యాయం జరిగిందని జేసీ చెప్పుకున్నారు. మరి కోర్టు ఆదేశాలతో జరిగినా అదంతా అన్యాయమే అని దివాకర్ రెడ్డి చెప్పుకుంటున్నారు. ఇక తనపై సీఎం జగన్ కు తీవ్రమైన కక్ష ఉందని, అంతలా కక్ష ఉంటే తనను నరికి చంపేయాలని దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. తనపైనా, చంద్రబాబు మీద కక్ష ఉంటే చంపేయాలని దివాకర్ రెడ్డి ఆక్రోశించారు. అయినా చంపుకోవడం, నరుక్కోవడం ఏమిటో జేసీ సారూ! ప్రభుత్వ కక్ష సాధిపంఉ చర్యలు చేపట్టి ఉంటే.. చట్టపరంగా ఎదుర్కోవాలి కానీ!