Begin typing your search above and press return to search.
ప్రత్యేక హోదా మిస్టరీ తెలిసింది వారిద్దరికే..
By: Tupaki Desk | 6 Aug 2016 9:52 AM GMTబాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికైనా తెలుసా అంటే ఒక్క రాజమౌళికి - కథా రచయితకు మాత్రమే తెలుసని అనుకోవాలి. అలాగే ఏపీ ప్రత్యేక హోదా వస్తుందా? రాదా ? అన్నది కూడా ఇద్దరికే తెలుసట. ఆ ఇద్దరు ఎవరో తెలుసా... ఒకరు దేవుడు.. రెండోది మోడీ. ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి ఈ సంగతి చెప్పారు. నిన్న ప్రధానిని కలిసిన ఎంపీల బృందంలో ఉన్న జేసీ శనివారం అనంతపురంలో విలేకరులకు ఆ విషయాలన్నీ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమకు ప్రత్యేక హోదా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పిన జేసీ.. ప్రధానికి కూడా తాను అదే విషయం చెప్పానని చెప్పారు. అయితే ప్రత్యేక హోదా వస్తుందో ? లేదో ? అని కచ్చితంగా ఇద్దరు మాత్రమే చెప్పగలరని అన్నారు. ఆ సంగతి దేవుడుకు తెలిసినా దేవుడికి మనకి కమ్యూనికేషన్ ఉండదు కాబట్టి ఆ విషయం తెలిసిన రెండో వ్యక్తి ప్రధానే ప్రత్యేక హోదా వస్తుందా రాదా అన్న సంగతి చెప్పాలన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ లబ్ది చేకూరుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తమకు హామి ఇచ్చారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కలిసిన విషయం తెలిసిందే. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు మోడీని కలిశారు. మోడీతో వారి భేటీ కేవలం పది నిమిషాలే సాగినా యువర్ ప్రాబ్లెం ఈజ్ మై ప్రాబ్లెం అని మోడీ చెప్పడంతో అందరూ నమ్మకంగా తిరిగొచ్చారు. ఈ నేపధ్యంలో శనివారం విలేకరుల ప్రత్యేక హోదా వస్తుందా ? అని ప్రశ్నించగా జేసీ ఇలా స్పందించారు. ఆ విషయం ఇద్దరికే తెలుసని.. అందులో మోడీ మాత్రమే మనకు చెప్పగలరని అన్నారు. మరి మోడీ ఏం చెబుతారో... ఎప్పుడు చెబుతారో మనం వేచి చూడాల్సిందేనన్న మాట.